Share News

Andhra Pradesh weather update: ఈదురుగాలులతో వర్షాలు.. భగభగ ఎండలు

ABN , Publish Date - Apr 18 , 2025 | 04:28 AM

రాయలసీమపై ఉపరితల ఆవర్తనంతో కోస్తా, రాయలసీమల్లో ఎండ తీవ్రత కొనసాగుతోంది. వచ్చే 48 గంటల్లో పిడుగులతో కూడిన వర్షాలు, వడగండ్ల వానలు కొన్ని జిల్లాల్లో కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

Andhra Pradesh weather update: ఈదురుగాలులతో వర్షాలు.. భగభగ ఎండలు

రాష్ట్రంలో వాతావరణ అనిశ్చితి.. నేడు, రేపూ భిన్న వాతావరణం

అమరావతి, విశాఖపట్నం, ఏప్రిల్‌ 17(ఆంధ్రజ్యోతి): రాయలసీమలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. వాయవ్య రాజస్థాన్‌ నుంచి కర్ణాటక, తమిళనాడు మీదుగా గల్ఫ్‌ ఆఫ్‌ మన్నార్‌ వరకూ ఉపరితల ద్రోణి విస్తరించింది. మరోవైపు కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల ఎండ తీవ్రత, ఉక్కపోత కొనసాగాయి. వాతావరణ అనిశ్చితి నెలకొని గురువారం కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడ ఈదురుగాలులు, పిడుగులతో కూడిన వర్షాలు కురిశాయి. నంద్యాల జిల్లా గోస్పాడు, రుద్రవరంలో 42.5, కడప జిల్లా వేంపల్లెలో 41.5, తిరుపతి జిల్లా మంగనెల్లూరులో 41.4తో పాటు 36 ప్రాంతాల్లో 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. రెండు రోజులు భిన్న వాతావరణం ఉంటుందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. శుక్రవారం అల్లూరి జిల్లా కూనవరం, చిం తూరు మండలాల్లో వడగాడ్పులు వీస్తాయని, శ్రీకాకుళం, మన్యం, అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, ఏలూరు, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని పేర్కొంది. శనివారం శ్రీకాకుళం, మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, పల్నాడు, ప్రకాశం, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలిక నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఎన్టీఆర్‌ జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలో తీవ్రంగా, 83 మండలాల్లో మోస్తరు వడగాడ్పులు వీస్తాయని పేర్కొంది.


ఈ వార్తలు కూడా చదవండి..

National Testing agency: జేఈఈ మెయిన్ సెషన్ - 2 ఫైనల్ కీ విడుదల

AP Ministers: దెయ్యాలు.. వేదాలు వల్లించినట్లు..

AP High Court: బోరుగడ్డ అనిల్‌కు గట్టి షాక్

Rain Alert: తెలంగాణలో కాసేపట్లో వర్షం.. ఉరుములతో కూడిన వానలు.. ఏ జిల్లాల్లో అంటే..

Gold: పోలీసుల తనిఖీలు.. 18 కేజీల బంగారం పట్టివేత

Waqf Bill: వక్ఫ్ సవరణ చట్టంపై వాదనలు.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

K Ram Mohan Naidu: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుని అభినందించిన సీఎం చంద్రబాబు

తండ్రికి తలకొరివి పెట్టిన కూతురు

AP Govt: ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్ జారీ చేసిన ఏపీ ప్రభుత్వం

For AndhraPradesh News And Telugu News

Updated Date - Apr 18 , 2025 | 04:28 AM