Heatwave: రాష్ట్రం నిప్పుల కొలిమి
ABN , Publish Date - Apr 25 , 2025 | 03:55 AM
వాయవ్య గాలుల ప్రభావంతో రాష్ట్రంలో ఎండ తీవ్రత పెరిగింది; 139 ప్రాంతాల్లో 41 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దొర్నిపాడులో 43.8 డిగ్రీలు నమోదు కాగా, వచ్చే రెండు రోజులు కూడా ఎండలు కొనసాగుతాయని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది.
139 ప్రాంతాల్లో 41 డిగ్రీలపైనే గరిష్ఠ ఉష్ణోగ్రతలు
దొర్నిపాడులో 43.8, పెద్దదోర్నాలలో 43.7 డిగ్రీలు
అమరావతి, విశాఖపట్నం, ఏప్రిల్ 24(ఆంధ్రజ్యోతి): వాయవ్య గాలులతో రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో వేడి వాతావరణం నెలకొంది. గురువారం మధ్యాహ్నం కొన్ని ప్రాంతాలు నిప్పుల కొలిమిలా మారాయి. రాష్ట్రవ్యాప్తంగా 139 ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 41 డిగ్రీలపైనే నమోదయ్యాయి. నంద్యాల జిల్లా దొర్నిపాడులో 43.8, ప్రకాశం జిల్లా పెద్దదోర్నాలలో 43.7, కడప జిల్లా అట్లూరులో 43.6, విజయనగరంలో 42.8, కర్నూలు జిల్లా కామవరం, పల్నాడు జిల్లా నర్మలపాడులో 42.7, జంగమహేశ్వరపురంలో 42.5, ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడులో 42.4, నెల్లూరు జిల్లా మునుబోలు, తిరుపతి జిల్లా వెంకటగిరిలో 42.1 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కాగా, ఛత్తీ్‌సగఢ్ నుంచి తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు మీదుగా గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకూ విస్తరించిన ఉపరితలద్రోణి ప్రభావంతో కోస్తాలో అక్కడక్కడ వర్షాలు కురిశాయి. రానున్న రెండు రోజుల్లో ఎండ తీవ్రత కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది.
Also Read:
ఇలా నడిస్తే బోలెడు ప్రయోజనాలు..
లామినేషన్ మిషన్‌ను ఇలా వాడేశాడేంటీ...
ప్రధాని నివాసంలో కీలక సమావేశం..
For More Andhra Pradesh News and Telugu News..