AP High Court: కోర్టు ఆన్‌లైన్ విచారణలో అనధికారికంగా లాగిన్
ABN , Publish Date - Apr 18 , 2025 | 04:45 AM
కోర్టు విచారణ సందర్భంగా అనధికారికంగా లాగ్‌ఇన్ అయ్యి విధులకు ఆటంకం కలిగించిన వ్యక్తులపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తగిన చర్యలు తీసుకోవాలని రిజిస్ట్రీని ఆదేశించిన హైకోర్టు, ఆన్‌లైన్ విచారణను అర్ధంతరంగా ముగించింది.
హైకోర్టు ఆగ్రహం..వారిపై చర్యలకు ఆదేశం
విచారణను అర్ధంతరంగా ముగించిన న్యాయమూర్తి
వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్‌పై విచారణ సమయంలో ఘటన
అమరావతి, ఏప్రిల్ 17(ఆంధ్రజ్యోతి): కోర్టు విచారణ సందర్భంగా అనధికారికంగా లాగ్‌ఇన్ అయ్యి విధులకు ఆటంకం కలిగించిన వ్యక్తులపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ వ్యక్తులను గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని రిజిస్ట్రీని ఆదేశించింది. వైసీపీ నేత వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్‌పై ప్రాసిక్యూషన్ తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. తన వాదనలకు అవరోధం కలిగించడంపై లూథ్రా అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో న్యాయమూర్తి జస్టిస్ టి.మల్లిఖార్జునరావు ఆన్‌లైన్ విచారణను అర్ధంతరంగా ముగించారు. పిటిషన్లపై ఈ నెల 23న వాదనలు వింటామని ప్రకటించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఉమ్మడి కృష్ణాజిల్లా గన్నవరం టీడీపీ కార్యాలయంపై వల్లభనేని వంశీ, అతని అనుచరులు మూకదాడి చేసి వాహనాలను తగలబెట్టడంతోపాటు పలువురిపై దాడి చేసి గాయపర్చారు. పార్టీ కార్యాలయ కంప్యూటర్ ఆపరేటర్ సత్యవర్ధన్‌ను కులం పేరుతో దూషించారు. సత్యవర్ధన్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పలువురిని నిందితులుగా చేరుస్తూ 2023 ఫిబ్రవరి 22న గన్నవరం పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న వంశీకి బెయిల్ ఇచ్చేందుకు ట్రయల్ కోర్టు నిరాకరించడంతో హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఇదే కేసులో నిందితుడి ఉన్న గొంతెన రాజ్‌కుమార్ బెయిల్ పిటిషన్‌ను ఎస్సీ, ఎస్టీ కేసులను విచారించే విజయవాడ ప్రత్యేక కోర్టు కొట్టివేసింది. నిందితుడికి ఎస్సీ, ఎస్టీ చట్టం కింద పోలీసులు నమోదు చేసిన సెక్షన్లు వర్తించవనడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో క్రిమినల్ రివిజన్ కేసును సీఐడీ దాఖలు చేసింది. ఈ రెండు వ్యాజ్యాలు గురువారం హైకోర్టులో విచారణకు వచ్చాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
National Testing agency: జేఈఈ మెయిన్ సెషన్ - 2 ఫైనల్ కీ విడుదల
AP Ministers: దెయ్యాలు.. వేదాలు వల్లించినట్లు..
AP High Court: బోరుగడ్డ అనిల్‌కు గట్టి షాక్
Rain Alert: తెలంగాణలో కాసేపట్లో వర్షం.. ఉరుములతో కూడిన వానలు.. ఏ జిల్లాల్లో అంటే..
Gold: పోలీసుల తనిఖీలు.. 18 కేజీల బంగారం పట్టివేత
Waqf Bill: వక్ఫ్ సవరణ చట్టంపై వాదనలు.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
K Ram Mohan Naidu: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుని అభినందించిన సీఎం చంద్రబాబు
తండ్రికి తలకొరివి పెట్టిన కూతురు
AP Govt: ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్ జారీ చేసిన ఏపీ ప్రభుత్వం
For AndhraPradesh News And Telugu News