Borugadda Anil Kumar: నకిలీ నిగ్గు తేలాలి
ABN , Publish Date - Apr 18 , 2025 | 04:03 AM
నకిలీ మెడికల్ సర్టిఫికెట్ ఆధారంగా మధ్యంతర బెయిలు పొడిగించుకున్న బోరుగడ్డ అనిల్‌పై హైకోర్టు తీవ్రంగా స్పందించింది. వైద్యుడి వాంగ్మూలం రికార్డు చేసి పంపించేందుకు పీడీజేకు ఆదేశాలు జారీ చేసింది.
బోరుగడ్డ కేసులో హైకోర్టు కీలక నిర్ణయం
బెయిల్ పిటిషన్‌పై విచారణకు నిరాకరణ
ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్‌తో డాక్టర్ వాంగ్మూలం
నమోదు చేయించాలని పీడీజేకు ఆదేశం
అమరావతి, ఏప్రిల్ 17(ఆంధ్రజ్యోతి): రౌడీషీటర్ బోరుగడ్డ అనిల్ కుమార్ బెయిల్ పిటిషన్‌పై విచారణ జరిపేందుకు హైకోర్టు నిరాకరించింది. మధ్యంతర బెయిలు పొడిగింపుకోసం తల్లికి అనారోగ్యం పేరిట బోరుగడ్డ నకిలీ మెడికల్ సర్టిఫికెట్ సృష్టించినట్లు పోలీసులు.. అది నకిలీ సర్టిఫికెట్ అని ఆస్పత్రి యాజమాన్యం చెప్పడం లేదని బోరుగడ్డ తరఫు న్యాయవాది పేర్కొనడంతో కీలక నిర్ణయం తీసుకుంది. గుంటూరు లలిత సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి వైద్యుడు పీవీ రాఘవశర్మ పేరిట సర్టిఫికెట్ సృష్టించిన నేపథ్యంలో.. ఆ వైద్యుడి వాంగ్మూలాన్ని జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్‌తో రికార్డు చేయించి తమకు పంపాలని గుంటూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి (పీడీజే)ని ఆదేశించింది. అది తమకు అందిన తర్వాతే బోరుగడ్డ బెయిల్ పిటిషన్‌పై విచారణ జరుపుతామని స్పష్టం చేసింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ టి.మల్లికార్జునరావు గురువారం ఉత్తర్వులు ఇచ్చారు.

అనంతపురం పోలీసులు నమోదు చేసిన కేసులో రాజమహేంద్రవరం జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న బోరుగడ్డ తన తల్లికి చికిత్స చేయించాలంటూ మధ్యంతర బెయిలు పొందారు. ఆ తర్వాత... నకిలీ మెడికల్ సర్టిఫికెట్ చూపించి మధ్యంతర బెయిల్ పొడిగించుకున్నారు.
అయితే తాను ఎలాంటి మెడికల్ సర్టిఫికెట్ ఇవ్వలేదని వైద్యుడు పీవీ రాఘవశర్మ వాంగ్మూలం ఇచ్చారని, బోరుగడ్డపై కోర్టు ధిక్కరణ చర్యలు ప్రారంభించాలని పోలీసులు అనుబంధ పిటిషన్ వేశారు. వ్యాజ్యం గురువారం విచారణకు రాగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ మెండ లక్ష్మీనారాయణ.. గుంటూరు లలిత ఆస్పత్రి, చెన్నై అపోలోలో పోలీసులు సేకరించిన వివరాలను సీల్డ్ కవర్‌లో కోర్టు ముందుంచారు. బోరుగడ్డ సమర్పించిన మెడికల్ సర్టిఫికెట్‌లోని రాత, సంతకం తనవి కాదని వైద్యుడు రాఘవశర్మ పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారన్నారు. పిటిషనర్ తరఫు న్యాయవాది స్పందిస్తూ.. వైద్యుడు మెడికల్ సర్టిఫికెట్ ఇవ్వలేదని పోలీసులు చెబుతున్నారు తప్ప యాజమాన్యం ఇవ్వలేదని చెప్పడం లేదన్నారు. ఈ వివరాలు పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి.. డాక్టర్ రాఘవశర్మ వాంగ్మూలాన్ని నమోదు చేయించాలని గుంటూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి(పీడీజే)కి ఆదేశాలు జారీ చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
National Testing agency: జేఈఈ మెయిన్ సెషన్ - 2 ఫైనల్ కీ విడుదల
AP Ministers: దెయ్యాలు.. వేదాలు వల్లించినట్లు..
AP High Court: బోరుగడ్డ అనిల్‌కు గట్టి షాక్
Rain Alert: తెలంగాణలో కాసేపట్లో వర్షం.. ఉరుములతో కూడిన వానలు.. ఏ జిల్లాల్లో అంటే..
Gold: పోలీసుల తనిఖీలు.. 18 కేజీల బంగారం పట్టివేత
Waqf Bill: వక్ఫ్ సవరణ చట్టంపై వాదనలు.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
K Ram Mohan Naidu: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుని అభినందించిన సీఎం చంద్రబాబు
తండ్రికి తలకొరివి పెట్టిన కూతురు
AP Govt: ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్ జారీ చేసిన ఏపీ ప్రభుత్వం
For AndhraPradesh News And Telugu News