Share News

Electricity: విద్యుత్‌ సంస్థల్లో ఉన్నత కొలువులు

ABN , Publish Date - Apr 22 , 2025 | 04:53 AM

రాష్ట్ర విద్యుత్తు సంస్థలలో ఉన్నత స్థాయి నియామకాలకు సంబంధించి ప్రక్రియ పూర్తవుతోంది. గత వైసీపీ ప్రభుత్వంలో నియమితులైన డైరెక్టర్లను కొనసాగించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Electricity: విద్యుత్‌ సంస్థల్లో ఉన్నత కొలువులు

సీఎండీలు, డైరెక్టర్ల నియామకానికి కసరత్తు పూర్తి

మొత్తం 17 మంది డైరెక్టర్ల పోస్టులు భర్తీ

ఒకటి రెండు రోజుల్లో ఉత్తర్వులు

వైసీపీ హయాంలో నియమితులైన వారూ కొనసాగింపు

వారికి అవకాశం ఇవ్వడంపై విమర్శలు

అమరావతి, ఏప్రిల్‌ 21(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర విద్యుత్తు సంస్థల్లో ఉన్నత స్థాయి నియామకాలకు కసరత్తు దాదాపు పూర్తయింది. విద్యుత్తు పంపిణీ సంస్థలకు చైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్ల (సీఎండీ)లు, ఏపీజెన్‌కో, ట్రాన్స్‌కో, డిస్కమ్‌లలో డైరెక్టర్లను నియమించేందుకు రెండు నెలల కిందటే ప్రక్రియ మొదలైంది. ఆ పోస్టుల దరఖాస్తుదారులతో మౌఖిక ఇంటర్వ్యూలను కూడా ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్‌ పూర్తి చేశారు. అర్హులైన అభ్యర్థుల జాబితానూ సిద్ధం చేశారు. ఏపీ జెన్‌కోకు ఐదుగురు, ట్రాన్స్‌కోకు ఒకరు, ఏపీసీపీడీసీఎల్‌, ఏపీఎస్పీడీసీఎల్‌కు చెరో నలుగురు, ఏపీఈపీడీసీఎల్‌కు ముగ్గురు చొప్పున మొత్తంగా 17 మంది డైరెక్టర్లను నియమించాల్సి ఉంది. అయితే జగన్మోహనరెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడ్డాక.. డిస్కమ్‌ల సీఎండీలుగా తనవారినే నియమించుకున్నారు. ఈపీడీసీఎల్‌కు మాత్రం ఐఏఎస్‌ అధికారి పృథ్వీతేజకు అవకాశం ఇచ్చారు. డైరెక్టర్లను అయితే జగన్‌ సీఎం అయిన వెంటనే నిర్దాక్షిణ్యంగా తొలగించారు. ఇందుకు విరుద్ధంగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం వైసీపీ హయాంలో నియమితులైన డైరెక్టర్లను కూడా ఎంపిక ప్రక్రియలో భాగస్వాములను చేసింది. వీరిలో ఎక్కువ మందిని పాత వారినే కొనసాగిస్తున్నారని తెలిసింది. దీనిపై ఇంధన శాఖలో తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. అనుభవం పేరిట పాత వారిని కొనసాగించడం ఏమిటని ఇంధనరంగ నిపుణులు ప్రశ్నిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వంలో నియామకమైన వారిని కొనసాగించేందుకు వీల్లేదని చెబుతున్నారు. గతంలో డిస్కమ్‌ల సీఎండీలు ట్రాన్స్‌ఫార్మర్లు, ఇతర విద్యుత్తు పరికరాల కొనుగోళ్లలో చేతివాటం చూపారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. వాటి కారణంగానే విద్యుత్తు వినియోగదారులపై ట్రూఅప్‌ ఛార్జీల భారం మోయలేనంతగా పడిందన్న విమర్శలూ ఉన్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి..

Post Office: ఏమిటి.. ఇన్నీ మంచి పథకాలా..

10th Class Result: 10వ తరగతి పరీక్ష ఫలితాలు.. విడుదల ఎప్పుడంటే..

Business: ఈ పథకంలో జస్ట్ రూ. 45 పెట్టుబడిగా పెట్టండి.. రూ. 25 లక్షలు మీ సొంతం

Rs 500 Notes: రూ. 500 నోట్లపై కీలక అప్ డేట్: కేంద్రం వార్నింగ్

Pope Francis: పోప్ ఫ్రాన్సిస్ మృతి.. స్పందించిన ప్రధాని మోదీ

వాటికన్ సిటీలో పోప్ ఫ్రాన్సిస్ (21-04-2025) సోమవారం మృతి చెందారు.

RVNL: దేశంలోనే తొలిసారి... అతిపొడవైన 14.57 కి.మీ.సొరంగం పూర్తి

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - Apr 22 , 2025 | 04:53 AM