YSR Regime: హతవిధీ
ABN , Publish Date - Apr 23 , 2025 | 04:36 AM
వైఎస్ రాజశేఖరరెడ్డి మరియు జగన్ హయాంలో కలసి జరిగిన అవినీతి చర్యలు వల్ల ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు జైలు పాలయ్యారు. ఇప్పుడు వీరిని చిక్కుకున్న కేసుల్లో జైలు జరిమానాలు, సస్పెన్షన్‌లు, అవినీతి ఆరోపణలపై విచారణలు జరుగుతున్నాయి.
వైఎస్ మేళ్లకు నాడు ఐఏఎ్‌సలు..
జగన్ దెబ్బకు నేడు ఐపీఎ్‌సలు జైలుకు
కేసుల్లో మరికొందరు బ్యూరోక్రాట్లూ..
జత్వానీ కేసులో ఏకంగా ముగ్గురు
ఐపీఎ్‌సలు చిక్కుకున్న వైనం
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో జరిగిన కుంభకోణాలకు వత్తాసు పలికిన పలువురు ఐఏఎస్ అధికారులు జైలు పాలయ్యారు. రాష్ట్ర విభజన తర్వాత 2019లో జగన్ హయాంలో వైసీపీ అరాచక పాలనకు దన్నుగా నిలిచిన పీఎ్‌సఆర్ ఆంజనేయులు, పీవీ సునీల్ కుమార్, ఎన్. సంజయ్, కొల్లి రఘురామి రెడ్డి, కాంతి రాణా తాతా, విశాల్ గున్నీ, పల్లె జాషువా వంటి ఐపీఎ్‌సలు కటకటాలు లెక్కిస్తున్నారు. ఆనాడు ప్రతిపక్షాలను, ప్రజా సంఘాలను వేధించడం నుంచి అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపడం, స్థానిక ఎన్నికల్లో అక్రమాలకు సహకరించడం వరకూ వారిని జగన్ దారి మళ్లించారు. వీరంతా వైసీపీ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ వైపీఎ్‌సలుగా ముద్రపడ్డారు. ఆనక.. కూటమి ప్రభుత్వం రాగానే కేసుల్లో ఇరుక్కుపోయారు. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో తండ్రి తమకు చేసిన మేళ్లకు కుమారుడు జగన్‌కు లబ్ధి చేకూర్చిన పలు కంపెనీలు, అందుకు సహకరించిన ఐఏఎ్‌సలు ఇబ్బంది పడ్డారు. ఈ వ్యవహారంలో అప్పట్లో జగన్‌ను అరెస్టు చేసిన సీబీఐ ఏకంగా 11 అవినీతి కేసులు నమోదుచేసింది. మైనింగ్ అనుమతుల్లో అక్రమాలకు దన్నుగా నిలిచారంటూ ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మిని అరెస్టు చేసి జైలుకు పంపింది. చిన్న వయసులోనే ఐఏఎస్ సాధించిన ఆమెకు కేబినెట్ సెక్రటరీ అయ్యే అవకాశాలున్నాయని అంతకుముందు బ్యూరోక్రాట్లలో చర్చ జరిగేది. అటువంటి మహిళా ఐఏఎస్ అధికారి జైలు పాలవ్వడంతో ఆమె జీవితమే తలకిందులైంది. కేబినెట్ సెక్రటరీ కాదు కదా కనీసం రాష్ట్రానికి సీఎస్ అయ్యే అవకాశం కూడా దక్కలేదు. ప్రస్తుతం ఎటువంటి పోస్టింగ్ లేకుండా పదినెలలుగా ఆమె ఎదురుచూస్తున్నారు. వచ్చే ఏడాది జూన్‌లో పదవీ విరమణ చేయబోతున్నారు. మరో ఐఏఎస్ అధికారి బీపీ ఆచార్య. ఉమ్మడి రాష్ట్రంలో హోంశాఖ సెక్రటరీ హోదాలో చంచల్ గూడ జైలును సందర్శించి వచ్చిన ఆయన వారం తిరక్కుండానే అదే జైలుకు కన్నీరు పెట్టుకుంటూ వెళ్లారు.
అప్పటివరకూ ఎంతో మంచి పేరున్న ఆయన వైఎస్ ప్రభుత్వంలో భూ కేటాయింపుల్లో ఆరోపణలు ఎదుర్కొన్నారు. అప్పటి మైనింగ్ డైరెక్టర్ రాజగోపాల్ సైతం జైలు పాలయ్యారు. తిరిగి జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే కథ సుమారుగా పునరావృతమైంది. అప్పటి సీఎం జగన్ మనసులో ఆలోచనల్ని పసిగట్టి అరాచకాలకు వ్యూహం రచించిన పీఎ్‌సఆర్, ముంబైకి చెందిన సినీ నటి కాదంబరి జత్వానీని వేధింపులకు గురిచేసే పథక రచన చేశారు. బాధితురాలి ఫిర్యాదుతో ఎట్టకేలకు జైలు పాలయ్యారు. విజయవాడ మాజీ పోలీస్ కమిషనర్ కాంతి రాణా తాతా...ఇబ్రహీంపట్నం పోలీసు స్టేషన్‌లో నమోదైన ఇదే కేసులో నిందితుడిగా సస్పెన్షన్‌లో ఉన్నారు. డీఐజీ విశాల్ గున్నీ అత్యుత్సాహం చూపి ఈ కేసులో చిక్కుకున్నారు. జగన్ అరాచకాలకు కొమ్ము కాసిన పీవీ సునీల్ కుమార్ సీఐడీ ఏడీజీగా ఉన్నప్పుడు మాజీ ఎంపీ (ప్రస్తుతం ఉప సభాపతి) రఘురామకృష్ణంరాజును హింసించిన ఆరోపణలపై కేసు నమోదవడంతో సస్పెండయ్యారు. మరో ఐపీఎస్ అధికారి ఎన్.సంజయ్ అవినీతి కేసుల్లో చిక్కుకుని సస్పెండ్ అయ్యారు. మాజీ మంత్రి విడదల రజనీ ఒత్తిడితో మైనింగ్ వ్యాపారుల్ని బెదిరించిన కేసులో పల్లె జాషువా సస్పెండయ్యారు. వెంకట రెడ్డి గనుల శాఖ డైరెక్టర్‌గా జగన్ అక్రమాలకు వత్తాసు పలికి, ఏసీబీకి చిక్కి, రెండు నెలలు జైలు పాలై బెయిలుపై విడుదలయ్యారు. మరోవైపు మద్యం కుంభకోణంలో కీలక పాత్ర పోషించిన ఐఆర్‌టీఎస్ అధికారి వాసుదేవరెడ్డి ఆర్నెళ్లకు పైగా అజ్ఞాతంలో ఉండి ఇటీవలే రాష్ట్రం నుంచి రిలీవై కేంద్ర సర్వీసులకు వెళ్లిపోయారు. జగన్ రోతపత్రికకు దోచిపెట్టేందుకే తాను ఏపీకి వచ్చినట్లు వ్యవహరించిన ఐఐఎస్ అధికారి తుమ్మా విజయ్‌కుమార్ రెడ్డి ఇటీవలే విచారణకు వచ్చి వెళ్లారు.
Also Read:
కసిరెడ్డి కేసులో బిగ్ ట్విస్ట్..
చంపింది మేమే.. TRF ఉగ్రవాద సంస్థ ప్రకటన
For More Andhra Pradesh News and Telugu News..