Share News

ప్లాస్టిక్‌ వినియోగం తగ్గించండి

ABN , Publish Date - Mar 15 , 2025 | 10:56 PM

సమాజంలో ప్లాస్టిక్‌ను రూపుమాపి, ప్లాస్టిక్‌ రహిత గ్రామాలుగా తీర్చిదిద్దాలని అధికారులు ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు. శనివారం‘స్వచ్ఛ ఆంధ్ర - స్వచ్ఛ దివస్‌’ను అట్టహాసంగా నిర్వహించారు. పలుప్రభుత్వ కార్యాలయాల పరిసరాలను శుభ్రంగా తయారు చేశారు. అనంతరం చెత్త నిర్వహణను కట్టుదిట్టంగా నిర్వహించి పర్యావరణాన్ని కాపాడతామని ప్రతిజ్ఞ బూనారు.

ప్లాస్టిక్‌ వినియోగం తగ్గించండి
రామసముద్రంలో చెత్తను తొలగిస్తున్న ఎంపీడీఓ భానుప్రసాద్‌

15MPL--RSM1.gifకలకడలో అధికారులు, ప్రజలతో ఏర్పడిన మానవహారం

అట్టహాసంగా ‘స్వచ్ఛ ఆంధ్ర - స్వచ్ఛ దివస్‌’

ర్యాలీలు, పరిసరాలను శుభ్రపరిచిన సిబ్బంది

మానవహారంలా నిలిచిన అధికారులు, ప్రజలు

ప్లాస్టిక్‌ రహిత సమాజం కోసం చేసిన ప్రతిజ్ఞ

సమాజంలో ప్లాస్టిక్‌ను రూపుమాపి, ప్లాస్టిక్‌ రహిత గ్రామాలుగా తీర్చిదిద్దాలని అధికారులు ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు. శనివారం‘స్వచ్ఛ ఆంధ్ర - స్వచ్ఛ దివస్‌’ను అట్టహాసంగా నిర్వహించారు. పలుప్రభుత్వ కార్యాలయాల పరిసరాలను శుభ్రంగా తయారు చేశారు. అనంతరం చెత్త నిర్వహణను కట్టుదిట్టంగా నిర్వహించి పర్యావరణాన్ని కాపాడతామని ప్రతిజ్ఞ బూనారు. వివరాల్లోకెళితే...

పెద్దమండ్యం, మార్చి 15(ఆంధ్రజ్యోతి): ప్లాస్టిక్‌ రహిత గ్రామాలుగా తీర్చిదిద్దడానికి సమష్టిగా కృషి చేయాలని ఆర్‌డబ్ల్యూఎస్‌ డీఈ చంద్రశేఖర్‌, పెద్దమండ్యం తహసీల్దార్‌ సయ్యద్‌ ఆహ్మద్‌ పిలుపు నిచ్చారు. స్వర్ణాంధ్ర-స్వచ్ఛ దివస్‌ కార్యక్రమాల్లో భాగంగా మండల అధికారులు, విద్యార్థులు, స్థానికులు ర్యాలీ నిర్వహించి మానవహారం చేపట్టారు. ప్లాస్టిక్‌ వాడ కంతో భవిష్యత్తులో మానవాళికి ప్రమాదం వుందన్నారు. తహసీల్దార్‌ సయ్యద్‌ఆహ్మద్‌, ఎంపీడీఓ శ్రీధర్‌రావు, సర్పంచ్‌ బాష, ఏఈలు అశోక్‌, అక్రం, కార్యదర్శి సుబ్రమణ్యం కూటమి నేతలు గల్లా నారాయణ, ఫరూక్‌, గంగాధర, మహేశ్వర, విద్యార్థులు పాల్గొన్నారు.

మదనపల్లెలో...

మదనపల్లె టౌన్‌, మార్చి 15(ఆంధ్రజ్యోతి): గ్రామాల్లో ప్రజలు ప్లాస్టిక్‌ కవర్ల వినియోగం తగ్గించాలని మండల ప్రత్యేకాధికారి సహాయ బీసీ సంక్షేమశాఖాధికారి సబితరాణి పేర్కొన్నారు.


15PLR04.gifపీలేరులో ర్యాలీ నిర్వహిస్తున్న అధికారులు, విద్యార్థులు, పార్టీల ప్రతినిధులు

కురవంక సర్పంచ్‌ చిప్పిలి చలపతి ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఎంపీడీఓ తాజ్‌మస్రూర్‌ మాట్లాడుతూ ప్లాస్టిక్‌ కవర్ల వినియోగంలో ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలను ప్రజలు పాటించాలన్నారు. పంచాయతీ కార్మికులు, ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు. ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపాల్‌ కృష్ణవేణి ఆధ్వర్యంలో విద్యార్థినులు స్వచ్ఛ ఆంధ్ర - స్వచ్ఛదివస్‌ నిర్వహించారు. మోహనవల్లి, ఖాజావలి పాల్గొన్నారు.

నిమ్మనపల్లిలో...

నిమ్మనపల్లి, మార్చి 15(ఆంధ్రజ్యోతి): బస్టాండులో ప్రత్యేక అధికారి ప్రసాద్‌ ఆధ్వర్యంలో మానవహారం, ర్యాలీ చేపట్టారు. పంచాయతీ కార్యాలయం ఆవరణలో చెత్తను శుభ్రం చేశా రు. ఎంపీడీఓ పరమేశ్వర్‌రెడ్డి, ఏఓ రమేష్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈ మిధున్‌చక్రవర్తి, ఏపీఓ రమేష్‌, సిబ్బంది గుర్రప్ప పాల్గొన్నారు.

రామసముద్రంలో...

రామసముద్రం, మార్చి 15(ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలో ఎంపీడీఓ భానుప్రసాద్‌, ఏపీఎం సాంబశివ ఆధ్వర్యంలో స్వచ్చ ఆంధ్ర, స్వచ్ఛ దివస్‌ నిర్వహించారు. అధికారులు, సచివాలయ సిబ్బంది, పారిశుధ్య కార్మికులు మండల కార్యాలయం నుంచి ర్యాలీగా వెళ్లి అంబేడ్కర్‌ సర్కిల్‌లో మానవహారం నిర్వహించారు.


ఇరిగేషన్‌ డీఈ సురేష్‌, ఏఈ శ్రీధర్‌, ఏపీఎం సాంబశివ, సీసీ గంగాధర్‌, కార్యదర్శి మునిస్వామినాయక్‌ పాల్గొన్నారు.

ములకలచెరువులో...

ములకలచెరువు, మార్చి 15(ఆంధ్రజ్యోతి): స్వచ్ఛ ఆంధ్ర - స్వచ్ఛ దివస్‌లో భాగంగా విద్యార్థులతో కలిసి అధికారులు భారీ ర్యాలీ నిర్వహించారు. మండల ప్రజా పరిషత్‌ కార్యాలయం నుంచి పెట్రోల్‌ బంకు, ఆర్టీసీ బస్టాం డు మీదుగా బస్టాండు సర్కిల్‌ వరకు ప్రదర్శ న చేపట్టారు. అనంతరం బస్టాండు సర్కిల్‌లో మానవహారంగా నిలబడి ప్రతిజ్ఞ చేశారు. ఎంపీడీఓ హరినారాయణ, ఎస్‌ఐ నరసింహు డు, ఎంఈఓ వెంకటరమణ, ఏపీఎం మధుశేఖర్‌బాబు, సర్పంచ్‌ రహమత్‌బీ పాల్గొన్నారు.

తంబళ్లపల్లెలో...

తంబళ్లపల్లె, మార్చి 15(ఆంధ్రజ్యోతి): ప్లాస్టిక్‌ నిషేధం అందరి బాధ్యత అని, బట్ట సంచుల ను వినియోగించాలని జిల్లా పశు సంవర్ధక శాఖ జేడీ, మండల ప్రత్యేకాధికారి గుణశేఖర్‌ పిళ్లై అన్నారు. ప్లాస్టిక్‌ కవర్ల వాడకంతో కలిగే అనర్థాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఎంపీడీఓ కార్యాలయం నుంచి కూటమి నేత లు, మండల అధికారులు, విద్యార్థులతో కలసి ప్లకార్డులుతో ర్యాలీ నిర్వహించారు. హరిత సర్కిల్‌లో మానవహారం ఏర్పడి ప్రతిజ్ఞ చేశా రు. ఎంపీడీఓ ఉపేంద్రారెడ్డి, ఎంఈఓ త్యాగరాజు, ఏపీఓ అంజనప్ప. ఏపీఎం గంగాధర్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈ వినోద్‌, టీడీపీ మండలాధ్యక్షుడు రెడ్డప్పరెడ్డి, సిద్ధమ్మ, ఉత్తమ్‌రెడ్డి, వీరాంజనేయులు, పురుషోత్తం, నరసింహులు, రామ్మోహన్‌రెడ్డి, వికలాంగ అధ్యక్షుడు రామాంజులు తదితరులు పాల్గొన్నారు.

పెద్దతిప్పసముద్రంలో...

పెద్దతిప్పసముద్రం మార్చి 15 (ఆంధ్రజ్యోతి): ప్లాస్టిక్‌ వాడకాన్ని తగ్గించుకుందాం - ప్రకృతిని రక్షించుకుందామని మండల ప్రత్యేక అధికారి మునిరాజ్‌ వెల్లడించారు.


కార్యదర్శులు, సచివాలయ సిబ్బంది, గ్రీన్‌ అంబాసిడర్లు, మండల అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి పురవీధుల్లో భారీ ర్యాలీ నిర్వహించారు. ఎంపీడీఓ అబ్దుల్‌ కలాం ఆజాద్‌, వెలుగు ఏపీఎం హరి, ఆర్‌డబ్ల్యూఎస్‌ జేఈ బాలచంద్రాచారి, హౌసిం గ్‌ ఏఈ శ్రీనివాసులు పాల్గొన్నారు.

పీలేరులో...

పీలేరు, మార్చి 15(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ దివస్‌’ కార్యక్రమాన్ని మండల అధికారులు అట్టహాసంగా నిర్వహించారు. అధికారులు, పలు పార్టీల ప్రతినిధులు, వైద్య ఆరోగ్య శాఖ, ఏపీ ట్రాన్స్‌కో సిబ్బంది, పారిశుధ్య కార్మికులు, విద్యార్థులతో కలిసి ప్లాస్టిక్‌ నిషేధంపై అవగా హన ర్యాలీలు జరిపారు. అధికారులు మా ట్లాడుతూ రాష్ట్రాన్ని దేశంలోనే అత్యంత పరిశు భ్రత కలిగిన రాష్ట్రంగా తీర్చిదిద్దాలని ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు ప్రతి మూడో శనివారం ‘స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ దివస్‌’ కార్యక్ర మాన్ని చేపట్టారన్నారు. పంచాయతీ కార్యాల యం నుంచి నాలుగు రోడ్ల కూడలి వరకు ర్యాలీ నిర్వహించి మానవహారం చేపట్టారు. అనంతరం చెత్త నిర్వహణను పకడ్బందీగా నిర్వహించి పర్యావరణాన్ని కాపాడతామని ప్రతిజ్ఞ బూనారు.


కార్యక్రమాల్లో ఏపీ పంచా యతీ కార్మికుల యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షుడు ధనాశి వెంకటరామయ్య, ఎంపీడీఓ శివశంకర్‌, ఈఓపీఆర్‌ఆర్‌డీ లతీఫ్‌ ఖాన్‌, కార్యదర్శులు జ్ఞానశేఖర్‌, శివాజీ, శానిటరీ అధికారి నౌషాద్‌ అహ్మద్‌, టీడీపీ నేతలు పురం రామ్మూర్తి, పోలిశెట్టి సురేంద్ర, రహంతుల్లా, నౌలాక్‌, బుజ్జు, తదితరులు పాల్గొన్నారు.

వాల్మీకిపురంలో...

వాల్మీకిపురం, మార్చి 15(ఆంధ్రజ్యోతి): ప్లాస్టిక్‌ వాడకం ప్రమాదకరమని ప్రభుత్వాస్పత్రి సూ పరింటెండెంట్‌ డాక్టర్‌ రవికుమార్‌ అన్నారు. స్వచ్ఛ ఆంధ్ర - స్వచ్ఛదివస్‌పై అవగాహన చేపట్టారు. వైద్యులు, సిబ్బందితో కలిసి ఆస్పత్రి ఆవరణలో శ్రమదానం చేశారు. కార్యక్రమాల్లో ఎంపీడీఓ మనోహర్‌రాజు, ఈఓ రవీంద్రనాథ్‌, కురబ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ వల్లిగట్ల వెంకట రమణ, మండల టీడీపీ అధ్యక్షుడు మల్లికార్జు నరెడ్డి, సర్పంచ్‌ గంగులమ్మ, ఉపసర్పంచ్‌ కేశ వరెడ్డి, డాక్టర్లు హర్షిత, మమత, శివాణి, సోని, ఆసిఫ్‌, ప్రజలు పాల్గొన్నారు.

కలకడలో...

కలకడ, మార్చి 15(ఆంధ్రజ్యోతి): ప్రజలు బా ధ్యతగా పర్యావరణ రక్షణకు నడుంబిగించాలని మండల ప్రత్యేకాధికారి భరత్‌ కుమా ర్‌రెడ్డి, ఎంపీడీఓ అబ్దుల్‌ రహీం పిలుపునిచ్చారు. శని వారం కలకడలో ర్యాలీ నిర్వ హించారు. అనంతరం వ్యాపా రులకు కరపత్రాలను పంపిణీ చేసి బస్టాండు కూడలిలో మానవహారం చేశారు. కార్యక్ర మంలో కార్యదర్శి దేవేంద్ర, ప్రజాప్ర తినిధులు, కార్మికులు పాల్గొన్నారు.

Updated Date - Mar 15 , 2025 | 10:56 PM