Home » Andhra Pradesh » Kadapa
పోరుమా మిళ్ల మండలంలోని రం గసముద్రం పంచాయతీ సుందరయ్యకాలనీలో పో లీసులు కార్డెన సెర్చ్ నిర్వహించారు.
మూగ జీవులను అడ్డం పెట్టుకొని వైసీపీ నేత భూమన కరుణాకర్రెడ్డి రాజకీయాలు చేయడం తగదని జమ్మలమడుగు నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి భూపేష్రెడ్డి పేర్కొన్నారు.
వైఎస్ వివేకా హత్య జరిగిన తరువాత గాయాలు కనపడకుండా కట్లు కట్టి, గుండెపోటుగా చిత్రీకరించిన వారిలో ఉదయ్ కుమార్ రెడ్డి ఒకరని సునీతా తరపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. దీంతో సుప్రీంకోర్టు ఉదయ్ కుమార్ రెడ్డికి నోటీసులు జారీచేసింది.
ఉమ్మడి నెల్లూరు జిల్లాలో వేర్వేరు ప్రమాదాల్లో నలుగురు మృత్యువాత పడ్డారు. రాపూరు తిక్కనవాటిక పార్క్ సమీపంలో ఓ ద్విచక్రవాహనాన్ని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్పై వెళ్తున్న సురేశ్, అతని అత్త సరస్వతి అక్కడికక్కడే మరణించారు.
అన్నమయ్యజిల్లాలో విషాదం నెలకొంది. మైలపల్లెరాచపల్లెకు చెందిన ఏడేళ్ల వయసుగల ముగ్గురు బాలురు ఈతకు వెళ్లి నీటికుంటలో మునిగి చనిపోయారు. సంఘటన ప్రదేశానికి చేరుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృత దేహాలను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Vontimitta: ఒంటిమిట్టలో కొలువు తీరిన శ్రీసీతారామచంద్రమూర్తికి సీఎం చంద్రబాబు దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం సీతారాముల కల్యాణం జరిగింది. ఈ కల్యాణాన్ని సీఎం దంపతులు వీక్షించారు. రాత్రికి సీఎం చంద్రబాబు దంపతులు ఒంటిమిట్టలోనే బస చేయనున్నారు.
సీతారాముల కల్యాణానికి కడప జిల్లా ఒంటిమిట్ట సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. శుక్రవారం జరుగనున్న కల్యాణోత్సవానికి రాష్ట్ర ప్రభుత్వం, టీటీడీ ఆధ్వర్యంలో కనీవిని ఎరుగని రీతిలో ఏర్పాట్లు చేసింది. వేదిక ముందుభాగంలో వీవీఐపీ గ్యాలరీతో పాటు క్యూలైన్లు, ఆలయం వద్ద భారీగా చలువ పందిళ్లు సిద్ధం చేశారు. కల్యాణోత్సవానికి సీఎం చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించనున్నారు.
మంత్రి సవిత ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ విస్తృతస్థాయి సమావేశం మంగళవారం పులివెందులలో జరిగింది. ఈ క్రమంలో టీడీపీ నాయకుల మధ్య వర్గ విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి, బీటెక్ రవి మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. ఈ క్రమంలో సమావేశంలో ఇరువర్గాలకు చెందినవారు బాహా బాహీకి దిగారు.
అన్నమయ్య జిల్లాలో సోమవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన డిప్యూటీ కలెక్టర్ రమాదేవిని ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Ahmed Basha Arrested: మాజీమంత్రి, వైసీపీ నేత అంజాద్ భాష తమ్ముడు అహ్మద్ భాషను కడప పోలీసులు అరెస్ట్ చేశారు. ముంబైలో ఆయన ఉన్నట్లు సమాచారం తెలుసుకుని అక్కడకు వెళ్లిన పోలీసులు అహ్మద్ భాషను అదుపులోకి తీసుకున్నారు.