రసవత్తరంగా పోలింగ్
ABN , Publish Date - Apr 22 , 2025 | 12:48 AM
కాకినాడ నగరంలో ఎంతో ప్రతిష్టాత్మకమైన కాకినాడ బార్ అసోసియేషన్ ఎన్నికల పోలింగ్ సోమవారం రసవత్తరమైన వాతావరణంలో సాగింది. కాకినాడ జిల్లా కోర్టు ప్రాంగణంలో ఉదయం 8.30 గంటల నుంచే పోలింగ్ హడావిడి మొదలైంది. పోటీలో ఉన్న అభ్యర్థులు, వారి మద్దతుదారులతో బార్ అసోసియేషన్ ప్రాంగణం కిటకిటలాడింది.
ప్రశాంతంగా కాకినాడ బార్ అసోసియేషన్ ఎన్నికలు
అర్ధరాత్రి వరకు కొనసాగిన ఓట్ల లెక్కింపు
కొలిక్కిరాని ప్రధాన పోస్టుల ఫలితాలు
(కాకినాడ, ఆంధ్రజ్యోతి)
కాకినాడ నగరంలో ఎంతో ప్రతిష్టాత్మకమైన కాకినాడ బార్ అసోసియేషన్ ఎన్నికల పోలింగ్ సోమవారం రసవత్తరమైన వాతావరణంలో సాగింది. కాకినాడ జిల్లా కోర్టు ప్రాంగణంలో ఉదయం 8.30 గంటల నుంచే పోలింగ్ హడావిడి మొదలైంది. పోటీలో ఉన్న అభ్యర్థులు, వారి మద్దతుదారులతో బార్ అసోసియేషన్ ప్రాంగణం కిటకిటలాడింది. సాయంత్రం 5 గంటల వరకు జరిగిన పోలింగ్‌లో న్యాయవాదులు ఎంతో ఉత్సాహం గా పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
బార్ అసోసియేషన్ కార్యవర్గంలో సుమారు 12 పదవులు ఉండగా.. రెండు పదవులను ఏక గ్రీవం చేశారు. ఇక మిగిలిన పది పదవులకు 27మంది అభ్యర్థులు పోటీలో నిల్చున్నారు. ప్ర స్తుతం బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా పెం దుర్తి ప్రసన్నకుమార్, ఏలూరి సుబ్రహ్మణ్యం తలపడుతున్నారు. వీరిలో ప్రసన్నకుమార్ తొలిసారి, సుబ్రహ్మణ్యం మూడోసారి తమ అదృ ష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. సాయంత్రం 5గంటల వరకు సాగిన పోలింగ్ ప్రక్రియలో మొత్తం 1160 ఓట్లకుగాను 1013 ఓట్లు పోలయ్యాయి. సాయంత్రం ఆరు గంటలకు ప్రారంభమైన ఓట్ల లెక్కింపు ప్రక్రియ అర్ధరాత్రి దాటినా కొలిక్కిరాలేదు.
కొన్ని ఫలితాలే వెల్లడి
కాగా, రాత్రి 12గంటలకు ఉపాధ్యక్షుడు, జా యింట్ సెక్రటరీ, లేడీ రిప్రజెంటేటీవ్, సీనియర్ కమిటీ మెంబర్స్, కమిటీ మెంబర్స్, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ సెక్రటరీ అభ్యర్థుల ఫలితాలు వెలువడ్డాయి. కాకినాడ బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడిగా పి.రామచంద్రరాజు, జాయింట్ సెక్రటరీగా బండి నరేంద్ర, లేడీ రిప్రజెంటేటీ వ్‌గా దివ్యశ్రీ విద్య గెలుపొందారు. స్పోర్ట్స్ అండ్ కల్చరల్ సెక్రటరీగా జోకా విజయకుమార్ విజయం సాధించారు. కమిటీ సభ్యులుగా దుళ్ల నాగబా బు, గుత్తుల మంగరాజు, మర్ల ప్రవళ్లిక, షేక్ ప్రేమ్ నజీర్ గెలుపొందారు. బ్యాలెట్ బాక్సులో వేసి ఓట్లు కలిసిపోవడం, వాటిని తిరిగి వేరు చేయడంవల్ల లెక్కింపు ఆలస్యమవుతున్నట్టుగా కౌంటింగ్ సిబ్బంది తెలిపారు. ఈసారి నాన్ ప్రాక్టీస్ న్యాయవాదుల ఓట్లే కీలకంగా మారినట్టు తెలుస్తోంది. వారు ఎటువైపు ఉంటే ఆ అభ్యర్థికే విజయావకాశాలు ఎక్కువనే ప్రచారం సాగుతోంది.