Share News

Kinjarapu Rammohan Naidu: యంగ్‌ గ్లోబల్‌ లీడర్‌గా రామ్మోహన్‌నాయుడు

ABN , Publish Date - Apr 18 , 2025 | 03:38 AM

కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం ‘యంగ్‌ గ్లోబల్‌ లీడర్స్‌ 2025’ జాబితాలో చోటు దక్కించుకున్నారు. ప్రపంచానికి మార్గదర్శకత్వం అందించే యువ నాయకులలో భారతదేశం నుంచి ఏడుగురిలో ఒకరిగా గుర్తింపు పొందారు.

Kinjarapu Rammohan Naidu: యంగ్‌ గ్లోబల్‌ లీడర్‌గా రామ్మోహన్‌నాయుడు

వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌ జాబితాలో స్థానం

భారత్‌ నుంచి మొత్తం ఏడుగురికి చోటు

ఇదొక గొప్ప గౌరవం: కేంద్ర మంత్రి రామ్మోహన్‌

తెలుగువారు గర్వించదగ్గ సమయం: చంద్రబాబు

శ్రీకాకుళం/అమరావతి, ఏప్రిల్‌ 17(ఆంధ్రజ్యోతి): కేంద్ర కేబినెట్‌లో యువ మంత్రిగా దేశవ్యాప్తంగా ఇప్పటికే గుర్తింపు పొందిన కింజరాపు రామ్మోహన్‌నాయుడు మరో అరుదైన ఘనత సాధించారు. వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌ యంగ్‌ గ్లోబల్‌ లీడర్ల జాబితా 2025లో ఆయన స్థానం దక్కించుకున్నారు. ఈ ఏడాది సుమారు 50 దేశాలకు చెందిన 116 మందిని ఎకనామిక్‌ ఫోరమ్‌ ఎంపిక చేసింది. మారుతున్న ప్రపంచానికి తమదైన శైలిలో నాయకత్వం అందించే వివిధ రంగాలకు చెందిన 40 ఏళ్ల లోపున్న వారిని దీని కోసం ఎంపిక చేస్తారు. ఈ సంవత్సరం జాబితాలో తమ రంగాల్లో ఉత్తమ నాయకత్వం కనబరిచిన యువ నేతలు, పారిశ్రామికవేత్తలు, క్రీడాకారులు, టెక్‌ సంస్థల వ్యవస్థాపకులు, మానవ హక్కుల నేతలు, న్యాయవాదులు ఉన్నారు. ఈ జాబితాలో భారతదేశం నుంచి ఏడుగురు చోటు దక్కించుకున్నారు. రామ్మోహన్‌నాయుడుతో పాటు ఓయో హోటల్స్‌ అండ్‌ హోమ్స్‌ వ్యవస్థాపకుడు రితేశ్‌ అగర్వాల్‌, బోస్టన్‌ కన్సల్టింగ్‌ గ్రూప్‌ ఎండీ నటరాజన్‌ శంకర్‌, పర్వాతారోహకుడు, పారిశ్రామికవేత్త అనురాగ్‌ మలూ తదితరులు ఉన్నారు. పార్లమెంట్‌లో అనర్గళంగా మాట్లాడగలిగే నేతగా రామ్మోహన్‌నాయుడు ఇప్పటికే దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. 26 ఏళ్ల వయసులో లోక్‌సభలో అడుగుపెట్టి తనదైన ప్రసంగ శైలితో ప్రజల మన్ననలు అందుకున్నారు. ఇక ప్రధాని నరేంద్ర మోదీ కేబినెట్‌లో యువ కేంద్ర మంత్రిగా పౌరవిమానయాన శాఖలో ప్రత్యేక ముద్ర వేస్తున్నారు. యంగ్‌ గ్లోబల్‌ లీడర్‌గా ఎంపిక కావడంపై కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు స్పందిస్తూ.. ‘‘వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం ద్వారా ‘యంగ్‌ గ్లోబల్‌ లీడర్‌’గా ఎంపిక కావడం గొప్ప గౌరవంగా భావిస్తున్నాను. ఈ గుర్తింపు ఒక్క నాకు చెందినది మాత్రమే కాదు. ముఖ్యమైన, ప్రపంచాన్ని ప్రభావితం చేసే నిర్ణయాలు తీసుకునే స్థానంలో భారత యువత ప్రాధాన్యం పెరుగుతోందని ఇది సూచిస్తోంది. నిజాయితీ, నూతన ఆలోచనలు, సమగ్రతతో ప్రజలకు సేవ చేయాలనే మా బాధ్యతను ఇది మరింత గుర్తుచేస్తుంది’’ అని తెలిపారు.


సీఎం చంద్రబాబు, లోకేశ్‌ అభినందనలు

యంగ్‌ గ్లోబల్‌ లీడర్స్‌ జాబితాలో రామ్మోహన్‌నాయుడికి చోటు దక్కడంపై సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రికి ముఖ్యమంత్రి అభినందలు తెలిపారు. దేశానికి ముఖ్యంగా తెలుగు ప్రజలకు ఇది గర్వించదగ్గ సమయమని, మున్ముందు రామ్మోహన్‌నాయుడు మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తూ చంద్రబాబు ఎక్స్‌లో పోస్టు చేశారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ కూడా రామ్మోహన్‌ నాయుడికి అభినందనలు తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

National Testing agency: జేఈఈ మెయిన్ సెషన్ - 2 ఫైనల్ కీ విడుదల

AP Ministers: దెయ్యాలు.. వేదాలు వల్లించినట్లు..

AP High Court: బోరుగడ్డ అనిల్‌కు గట్టి షాక్

Rain Alert: తెలంగాణలో కాసేపట్లో వర్షం.. ఉరుములతో కూడిన వానలు.. ఏ జిల్లాల్లో అంటే..

Gold: పోలీసుల తనిఖీలు.. 18 కేజీల బంగారం పట్టివేత

Waqf Bill: వక్ఫ్ సవరణ చట్టంపై వాదనలు.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

K Ram Mohan Naidu: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుని అభినందించిన సీఎం చంద్రబాబు

తండ్రికి తలకొరివి పెట్టిన కూతురు

AP Govt: ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్ జారీ చేసిన ఏపీ ప్రభుత్వం

For AndhraPradesh News And Telugu News

Updated Date - Apr 18 , 2025 | 03:38 AM