ఫారంపాండ్స్ రైతన్నలకు వరం
ABN , Publish Date - Mar 22 , 2025 | 01:03 AM
కూటమి ప్రభుత్వ హయాంలో రైతుల సంక్షేమం కోసం ప్రవేశ పెట్టిన ఫారంపాండ్స్ నిర్మాణం రైతన్నలకు వరం లాంటిదని ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు.

డిప్యూటీ సీఎం పర్యటనను విజయవంతం చేయండి
ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి
ఓర్వకల్లు, మార్చి 21(ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వ హయాంలో రైతుల సంక్షేమం కోసం ప్రవేశ పెట్టిన ఫారంపాండ్స్ నిర్మాణం రైతన్నలకు వరం లాంటిదని ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు. శనివారం డిప్యూటీ సీఎం పవన కళ్యాణ్ ఓర్వకల్లు మండలంలోని పూడిచెర్ల గ్రామానికి రానున్న సందర్భంగా పర్యటన ఏర్పాట్లను ఎమ్మెల్యేతోపాటు అధికారులు పరిశీలించారు. ఫారంపాండ్స్ నిర్మాణ భూమిని, బహిరంగ సభ స్టేజీని పరిశీలించి ఎమ్మెల్యే అధికారులకు పలు సూచనలు, సలహాలు చేశారు. అధికారులు సమన్వయంతో త్వరితగతిన పనులు పూర్తి చేసి పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి మాట్లాడుతూ గత టీడీపీ హయాంలో చంద్రబాబు నాయుడు అప్పట్లోనే ఫారంపాండ్స్ రైతు పొలాల్లో ఏర్పాటు చేశామన్నారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మళ్లీ ఫారంపాండ్స్ నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల ఫారంపాండ్స్ నిర్మాణం కోసం డిప్యూటీ సీఎం ప్రణాళికలు సిద్ధం చేశారన్నారు. ఫారంపాండ్స్ నిర్మాణంతో భూగర్భ జలాలు పెరగడమే కాకుండా వాటి కింద సాగు చేసిన పంటలకు సాగు నీరు అందించేందుకు ఎంతగానో ఉపయోగపడతాయని, ఆర్థికంగా బలపడతాయన్నారు. రైతులు వీటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. డిప్యూటీ సీఎం బహిరంగ సభకు టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చి జయప్రదం చేయాలని కోరారు. పాణ్యం నియోజకవర్గ సమస్యలు ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానన్నారు. కార్యక్రమంలో నంద్యాల టీడీపీ అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్, జనసేన ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు చింతా సురేష్‌బాబు, రాష్ట్ర వాల్మీకి కార్పొరేషన డైరెక్టర్ మంజునాథ్, నాయకులు విశ్వేశ్వరరెడ్డి, గోవిందరెడ్డి, మోహన రెడ్డి, రాంభూపాల్ రెడ్డి, లక్ష్మీకాంతరెడ్డి, పెరుగు పురుషోత్తంరెడ్డి, చంద్రపెద్దస్వామి, బ్రాహ్మణపల్లి నాగిరెడ్డి, తిరుపాలు, ప్రకాశం, శివుడు, రాజన్న డ్వామా పీడీ వెంకటసుబ్బయ్య, తహసీల్దార్ విద్యాసాగర్, ఎంపీడీవో శ్రీనివాసులు, ఏపీడీ లక్ష్మన్న, ఏపీవో కుమారసాయినాథ్ తదితరులు పాల్గొన్నారు.