చిత్రలేఖన పోటీల్లో పతకాలు
ABN , Publish Date - Apr 20 , 2025 | 11:32 PM
విజయవాడలోని డ్రీమ్ ఆర్ట్ అకాడమీ వారు నిర్వహించిన జాతీయస్ధాయి చిత్రలేఖన పోటీల్లో నంద్యాలకు చెందిన కోటేష్ ఆర్ట్ అకాడమీ విద్యార్ధులు తమ ప్రతిభతో పతకాల పంట పండించినట్లు నిర్వాహకులు చింతలపల్లె కోటేష్ తెలిపారు.
నంద్యాల కల్చరల్, ఏప్రిల్ 20(ఆంధ్రజ్యోతి): విజయవాడలోని డ్రీమ్ ఆర్ట్ అకాడమీ వారు నిర్వహించిన జాతీయస్ధాయి చిత్రలేఖన పోటీల్లో నంద్యాలకు చెందిన కోటేష్ ఆర్ట్ అకాడమీ విద్యార్ధులు తమ ప్రతిభతో పతకాల పంట పండించినట్లు నిర్వాహకులు చింతలపల్లె కోటేష్ తెలిపారు. ఈనెల 5న విజయవాడలో జాతీయస్ధాయి చిత్రకళా ప్రదర్శన, పోటీలకు నంద్యాలకు చెందిన కోటేష్ ఆర్ట్ అకాడమీకి చెందిన 28మంది విద్యార్ధులు వేసిన చిత్రాలు పోటీలకు పంపగా అందులో 16మంది చిన్నారులు పతకాలు సాధించారు. అందులో 8మంది బంగారు, 8మంది రజత పతకాలు సాధించారు. ప్రతిభ చాటిన చిన్నారులకు ఆదివారం అకాడమీలో అభినందన సభ ఏర్పాటుచేసి విజేతలకు పసిడి, రజతపతకాలతో పాటు సర్టిఫికెట్స్ కోటేష్ అందజేశారు. సాహిత, మృదుల, రాగవైష్ణవి, శ్రేష్ట, లాస్యశ్రీ, సాయిహవీస్, జోషిక, దిబంకుర్‌లకు పసిడి, భానుతేజ, హర్షిత, కాత్యాయిని, శాన్విఅనన్య, నీతూకృష్ణశ్రీ, బాదుల్లాసాయి, లక్ష్యసాయి, చరిత రజిత పతకాలు సాధించారు. ఈ సందర్భంగా కోటేష్ మాట్లాడుతూ చిన్నారులు పతకాలు సాధించడం ఆనందంగా ఉందన్నారు.