మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభం
ABN , Publish Date - Apr 20 , 2025 | 11:34 PM
నంద్యాల సర్వజన ప్రభుత్వ ఆస్పత్రిలో ఏర్పాటుచేసిన మినరల్ వాటర్‌ప్లాంట్‌ను ఆదివారం రాష్ట్ర మైనార్టీ, న్యాయశాఖ మంత్రి ఎనఎండీ ఫరూక్ ప్రారంభించారు.
నంద్యాల హాస్పిటల్, ఏప్రిల్ 20 (ఆంధ్రజ్యోతి): నంద్యాల సర్వజన ప్రభుత్వ ఆస్పత్రిలో ఏర్పాటుచేసిన మినరల్ వాటర్‌ప్లాంట్‌ను ఆదివారం రాష్ట్ర మైనార్టీ, న్యాయశాఖ మంత్రి ఎనఎండీ ఫరూక్ ప్రారంభించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా నంద్యాల సేవా ప్రగతి, లయన్సక్లబ్ ఆధ్వర్యంలో మాజీ కౌన్సిలర్ వాకా శివశంకర్ నేతృత్వంలో ఈ ఉచిత మినరల్ ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు. మంత్రి ఫరూక్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆస్పత్రిలో ఉచిత మినరల్ వాటర్ ప్లాంట్‌ను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. జిల్లాలోని నలుమూలల నుంచి రోగులు ఆస్పత్రికి వస్తుంటారని, వారి దాహార్తిని తీర్చేవిధంగా మినరల్ ప్లాంట్ ఏర్పాటుచేయడం అభినందనీయమన్నారు. అనంతరం ఆస్పత్రిలో రోగులకు పండ్లు, గుడ్లు మంత్రి ఫరూక్ , ఎనఎండి ఫిరోజ్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎనఎండి ఫిరోజ్, ఆస్పత్రి సూపరింటెండెంట్ డా.మల్లేశ్వరి, డా.రవికృష్ణ, కార్యకర్తలు పాల్గొన్నారు.