Share News

Pulivendula banana farmers: జగన్‌కు అరటి రైతులు ఇప్పుడు గుర్తొచ్చారా..!

ABN , Publish Date - Mar 25 , 2025 | 03:50 AM

మంత్రి అచ్చెన్నాయుడు జగన్ రెడ్డిపై విమర్శలు చేస్తూ, గత ఐదేళ్లుగా అరటి రైతుల సమస్యలను పట్టించుకోలేదని అన్నారు. ప్రభుత్వం ఇప్పుడు పరిహారం అందించి రైతులకు అండగా నిలుస్తుందని వెల్లడించారు.

Pulivendula banana farmers: జగన్‌కు అరటి రైతులు ఇప్పుడు గుర్తొచ్చారా..!

నష్టపోయిన ప్రతి రైతునూ ఆదుకుంటాం

ఉద్యాన పంటలకు 1.10 లక్షల వరకూ సాయం... బీమా అదనం: మంత్రి అచ్చెన్న

అమరావతి, మార్చి 24(ఆంధ్రజ్యోతి): ‘పులివెందులలో అరటి రైతులు ఉన్నారని జగన్‌రెడ్డికి ఇప్పుడు గుర్తొచ్చిందా? గిట్టుబాటు ధర లేక గత ఐదేళ్లలో వాళ్లు నష్టపోయినా జగన్‌రెడ్డి పట్టించుకున్న పాపాన పోలేదు’ అని మంత్రి అచ్చెన్నాయుడు మండిపడ్డారు. ఈ మేరకు సోమవారం ఆయన ఓ ప్రకటన చేశారు. ‘గతంలో ఎన్నడూ లేని విధంగా పరిహారం అందించి, రైతులకు అండగా నిలబడేందుకు మా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. రైతులు ఎవ్వరూ ఆధైర్యపడవద్దు. అరటి, మొక్కజొన్న, బొప్పాయి, వరి పంటలకు కొన్ని చోట్ల వర్షాలతో నష్టం జరిగింది. అనంతపురం, శ్రీసత్యసాయి, కడప, ప్రకాశం జిల్లాల్లో నష్టం వివరాలు అధికారులు సేకరిస్తున్నారు. మిగిలిన ప్రాంతాల్లోనూ ఎన్యూమరేషన్‌ ప్రారంభమౌతుంది. హెక్టారుకు రూ.35,000 మేర సబ్సిడీతో పాటు సమీకృత ఉద్యాన పంటల ప్రోత్సాహం కింద మొక్కలు తిరిగి నాటుకునేందుకు హెక్టారుకు రూ.75 వేలు అందజేస్తాం. మొత్తం రూ.1.10 లక్షల వరకూ రైతులకు సాయం అందనున్నది. బీమా ఉంటే చెల్లింపులు అదనం’ అని అచ్చెన్న వివరించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

YCP: భయం గుప్పెట్లో.. విశాఖ వైసీపీ

Mayor Suresh Babu: కడప గడ్డపై వైసీపీ షాక్

Bridesmaid Package: వివాహానికి ఆహ్వానించి.. అంతలోనే షాక్ ఇచ్చిన స్నేహితురాలు

Cell Phones: పిల్లలను సెల్ ఫోన్‌కు దూరంగా ఉంచాలంటే.. ఈ టిప్స్ ఫాలో అయితే చాలు..

T Congress Leaders: ఢిల్లీ చేరుకున్న కాంగ్రెస్ నేతలు.. కేబినెట్ కూర్పుపై కసరత్తు

For National News And Telugu News

Updated Date - Mar 25 , 2025 | 03:50 AM