Share News

పత్తి ఓబులయ్యను అభినందించిన మంత్రి

ABN , Publish Date - Mar 31 , 2025 | 11:52 PM

ఇటీవల ఉగాది పండుగ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా కళారత్న (హంస) పురస్కారం అందుకున్న టీజీవీ కళాక్షేత్రం అధ్యక్షుడు, నంది అవార్డు గ్రహీత పత్తి ఓబులయ్యను రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత అభినందించారు.

పత్తి ఓబులయ్యను అభినందించిన మంత్రి
పత్తి ఓబులయ్యను సత్కరిస్తున్న మాజీ ఎంపీ టీజీ వెంకటేశ

కర్నూలు కల్చరల్‌, మార్చి 31 (ఆంధ్రజ్యోతి): ఇటీవల ఉగాది పండుగ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా కళారత్న (హంస) పురస్కారం అందుకున్న టీజీవీ కళాక్షేత్రం అధ్యక్షుడు, నంది అవార్డు గ్రహీత పత్తి ఓబులయ్యను రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత అభినందించారు. ఆదివారం మౌర్య ఇనలోని మంత్రి కార్యాలయంలో జరిగిన ఒక కార్యక్రమంలో పురస్కార గ్రహీత పత్తి ఓబులయ్య పురస్కార వివరాలు మంత్రికి తెలియజేశారు. ఈ సందర్భంగా టీజీ భరత పత్తి ఓబులయ్యను ప్రశంసిస్తూ జిల్లా నాటక రంగ చరిత్రలో తొలిసారిగా కళారత్న (హంస) పురస్కారం సాధించడం అభినందనీయమని చెప్పారు. పత్తి ఓబులయ్య గత ఐదు దశాబ్దాలుగా నాటక రంగానికి అందిస్తున్న సేవలకు ప్రతిఫలంగా ఈ పురస్కారం అందుకొని ఔత్సాహిక కళాకారులకు మార్గదర్శకంగా నిలిచారని చెప్పారు.

ఫ హంస పురస్కార గ్రహీతను సత్కరించిన

మాజీ ఎంపీ టీజీ వెంకటేశ

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఉగాది పండుగ రోజున రాష్ట్ర ప్రభుత్వ కళారత్న (హంస) పురస్కారం అందుకోవడం అభినందనీయమని రాజ్యసభ మాజీ సభ్యుడు టీజీ వెంకటేశ అన్నారు. ఆదివారం మౌర్య ఇనలోని ఆయన ఛాంబర్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో పురస్కార గ్రహీత పత్తి ఓబులయ్యను శాలువతో ఘనంగా సత్కరించారు. హంస పురస్కారాల కార్యక్రమ వివరాలు తెలుసుకొన్నారు. టీజీ వెంకటేశ మాట్లాడుతూ తెలుగు దేశం ప్రభుత్వం ఎప్పుడు కళా, సాహి త్య రంగాలకు పెద్దపీట వేస్తోందని చెప్పారు. టీజీవీ కళాక్షేత్రం అధ్యక్షుడిగా, నాటక దర్శకునిగా, కళారంగానికి చేస్తున్న సేవలను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం హంస పురస్కారం పత్తి ఓబులయ్య అందజేయడం జరిగిందని ప్రశంసించారు. కార్యక్రమంలో రంగస్థల కళాకారులు గాండ్ల లక్ష్మన్న, జీవీ శ్రీనివాసరెడ్డి, వీవీ రమణారెడ్డి, రాజారత్నం, పాండురంగయ్య, రాజశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 31 , 2025 | 11:52 PM