Share News

Andhra Pradesh ration cards: రైతులకు సహకరించండి: బ్యాంకర్లతో మనోహర్‌

ABN , Publish Date - Apr 18 , 2025 | 04:30 AM

పేదలకు రేషన్‌ సరుకులు అందించేందుకు బ్యాంకర్లు సహకరించాలని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ విజ్ఞప్తి చేశారు. రైతులకు 9 నెలల్లో రూ.24,000 కోట్ల బకాయిలు చెల్లించినట్టు ఆయన తెలిపారు.

Andhra Pradesh ration cards: రైతులకు సహకరించండి: బ్యాంకర్లతో మనోహర్‌

అమరావతి, ఏప్రిల్‌ 17 (ఆంధ్రజ్యోతి): రైతులకు అండగా నిలిచేందుకు, పేదలకు రేషన్‌ సరుకులు అందించేందుకు సహకరించాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ బ్యాంకర్లను కోరారు. విజయవాడలోని సివిల్‌ సప్లయిస్‌ భవన్‌లో గురువారం బ్యాంకర్స్‌తో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రభుత్వం అందించే రేషన్‌ సరుకుల కోసం ప్రతినెలా ప్రజలు ఎదురుచూస్తున్నారని, బ్యాంకర్లు వడ్డీ రేట్లు తగ్గించి అభివృద్ధి కార్యక్రమాలకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. గత ప్రభుత్వం రైతులకు రూ.1,674 కోట్లు చెల్లించకుండా బకాయిలు పెట్టిందని, కూటమి ప్రభుత్వం వచ్చిన ఈ 9 నెలల్లోనే దాదాపు రూ.24వేల కోట్ల మేర రైతులకు బకాయిలు చెల్లించిందని చెప్పారు. సంస్కరణల్లో భాగంగా నూతన సాంకేతికతతో ధాన్యం కొనుగోలుకు వాట్సాప్‌ విధానాన్ని ప్రవేశపెట్టిందన్నారు. ఈ విధానం ద్వారా 17 వేల మంది రైతులు ధాన్యం విక్రయించినట్లు వివరించారు. ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లో నగదు జమ అవుతుండటంతో వారంతా ఆనందంగా ఉన్నారని తెలిపారు. మరోవైపు రేషన్‌బియ్యం పక్కదారి పట్టకుండా రేషన్‌ మాఫియాపై ఉక్కుపాదం మోపుతున్నట్లు మనోహర్‌ చెప్పారు. రాష్ట్రంలో అర్హులందరికీ త్వరలోనే కొత్త రేషన్‌ కార్డులు అందించనున్నామని తెలిపారు.


ఆయిల్‌ కంపెనీల ప్రతినిధులతో మంత్రి సమావేశం

రాష్ట్ర ప్రభుత్వం ‘దీపం-2’ పథకం కింద లబ్ధిదారులకు అందిస్తున్న ఉచిత గ్యాస్‌ సిలిండర్లను సరఫరా చేస్తున్న ఆయిల్‌ కంపెనీల ప్రతినిధులతో మంత్రి మనోహర్‌ సమావేశమయ్యారు. ఉచిత గ్యాస్‌ సిలిండర్లు డెలివరీ అయిన 48 గంటల్లోపు లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో సబ్సిడీ సొమ్ము జమ చేయాలని ఆదేశించారు. అయితే గత మార్చి 31న సిలిండర్లు బుక్‌ చేసుకున్న లబ్ధిదారులకు ఏప్రిల్‌లో డెలివరీ అయ్యాయని, వారికి సబ్సిడీ జమ చేయడానికి సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయని ఆయిల్‌ కంపెనీల ప్రతినిధులు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఈ సమస్యలను అధిగమించి లబ్ధిదారుల ఖాతాల్లో వెంటనే సబ్సిడీ జమ చేయాలని మంత్రి ఆదేశించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 99.22 లక్షల మంది లబ్ధిదారులు మొదటి ఉచిత సిలిండరును ఉపయోగించుకున్నారని ఆయన తెలిపారు. సమావేశంలో పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ సౌరభ్‌ గౌర్‌, సివిల్‌ సప్లయిస్‌ కార్పొరేషన్‌ ఎండీ మనజీర్‌ జిలాని తదితర అధికారులు, ఐవోసీ, హెచ్‌పీసీ, బీపీసీ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

National Testing agency: జేఈఈ మెయిన్ సెషన్ - 2 ఫైనల్ కీ విడుదల

AP Ministers: దెయ్యాలు.. వేదాలు వల్లించినట్లు..

AP High Court: బోరుగడ్డ అనిల్‌కు గట్టి షాక్

Rain Alert: తెలంగాణలో కాసేపట్లో వర్షం.. ఉరుములతో కూడిన వానలు.. ఏ జిల్లాల్లో అంటే..

Gold: పోలీసుల తనిఖీలు.. 18 కేజీల బంగారం పట్టివేత

Waqf Bill: వక్ఫ్ సవరణ చట్టంపై వాదనలు.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

K Ram Mohan Naidu: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుని అభినందించిన సీఎం చంద్రబాబు

తండ్రికి తలకొరివి పెట్టిన కూతురు

AP Govt: ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్ జారీ చేసిన ఏపీ ప్రభుత్వం

For AndhraPradesh News And Telugu News

Updated Date - Apr 18 , 2025 | 04:30 AM