Jagan corruption: అవినీతి చక్రవర్తి జగన్‌రెడ్డి
ABN , Publish Date - Apr 03 , 2025 | 05:36 AM
మాజీ సీఎం జగన్‌ను అవినీతి చక్రవర్తిగా మంత్రి వై. సత్యకుమార్ విమర్శించారు. చంద్రబాబు, మోదీ నేతృత్వంలో దేశం, రాష్ట్రం అభివృద్ధి చెందనున్నాయని పేర్కొన్నారు.

విశ్వసనీయత లేని పత్రికలో నాపై నిందలు: సత్యకుమార్
కడప, ఏప్రిల్ 2(ఆంధ్రజ్యోతి): ‘పంచభూతాలను సైతం వదలిపెట్టకుండా దోచుకున్న అవినీతి చక్రవర్తిగా మాజీ సీఎం జగన్ ఖ్యాతిగాంచారు’ అని మంత్రి వై.సత్యకుమార్ విమర్శించారు. బుధవారం బీజేపీ కడప జిల్లా అధ్యక్షుడు జంగిటి వెంకటసుబ్బారెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ వైద్య శాఖలో నేను అవినీతికి పాల్పడినట్లుగా విశ్వసనీయత లేని ఆయన రోత పత్రికలో అసత్య రాతలు రాయడం మరీ విడ్డూరం. మోదీ, చంద్రబాబు హయాంలో అటు దేశం, ఇటు రాష్ట్రం వికసిత్ భారత్, ఆంధ్రప్రదేశ్‌గా రూపుదిద్దుకోనున్నాయి. మరో 10 సంవత్సరాల పాటు కూటమి ప్రభుత్వాలు అధికారంలో కొనసాగేలా ప్రజలు ఆశీర్వదించాలి’ అన్నారు. ప్రభుత్వ విప్ ఆదినారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి:
FD Comparison: ఎస్బీఐ vs యాక్సిస్ బ్యాంక్.. వీటిలో ఏ FD బెస్ట్, దేనిలో ఎక్కువ వస్తుంది..
Samsung: శాంసంగ్ ఏసీల్లో సరికొత్త టెక్నాలజీ..స్మార్ట్ థింగ్స్ కనెక్షన్ సహా అనేక సౌకర్యాలు..