Tirumala: తిరుమలపై మాట్లాడే నైతిక అర్హత వైసీపీకి లేదు
ABN , Publish Date - Apr 18 , 2025 | 04:48 AM
తిరుమల పవిత్రత గురించి మాట్లాడే నైతిక అర్హత వైసీపీకి లేదని మంత్రులు అనగాని సత్యప్రసాద్, గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. వైసీపీ గోశాలపై అబద్ధాలు ప్రచారం చేస్తోందని, తప్పుడు ఆరోపణలతో రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని విమర్శించారు.
మంత్రులు అనగాని, గొట్టిపాటి
అమరావతి, ఏప్రిల్ 17 (ఆంధ్రజ్యోతి): తిరుమల పవిత్రత గురించి మాట్లాడే నైతిక అర్హత వైసీపీకి లేదని మంత్రు లు అనగాని సత్యప్రసాద్, గొట్టిపాటి రవికుమార్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. తిరుమల దర్శనానికి వచ్చి డిక్లరేషన్ కూ డా ఇవ్వకుండా సాంప్రదాయాలు పాటించని వాళ్లు తమపై నిందలు వేస్తారా అని గొట్టిపాటి ప్రశ్నించారు. కులమతాలను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని వైసీపీ చూస్తోందన్నారు. తండ్రి, బాబాయ్‌ని కూడా వదలకుండా శవరాజకీయాలు చేసిన వాళ్లు ఇప్పుడు మూగజీవాలనూ వదలడం లేదన్నారు. అనగాని మాట్లాడుతూ... తిరుమల గోశాలపై వైసీపీ అబద్ధాలు ప్రచారం చేస్తోందనే విషయం స్పష్టమైందన్నారు. టీటీడీ విషయలో వైసీపీ చేస్తున్న కుట్రలు బట్టబయలు అయ్యాయన్నారు. వైసీపీ ఎంపీ గురుమూర్తి గోశాల వరకు వచ్చి వారు చేసిన ఆరోపణల్లో గడ్డిపరకంత కూడా రుజువు చేయలేకపోయారన్నారు. కరుణాకర్‌రెడ్డికి అబద్ధపు ప్రచారాలు కొత్త కాదని మంత్రి అనగాని విమర్శించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
National Testing agency: జేఈఈ మెయిన్ సెషన్ - 2 ఫైనల్ కీ విడుదల
AP Ministers: దెయ్యాలు.. వేదాలు వల్లించినట్లు..
AP High Court: బోరుగడ్డ అనిల్‌కు గట్టి షాక్
Rain Alert: తెలంగాణలో కాసేపట్లో వర్షం.. ఉరుములతో కూడిన వానలు.. ఏ జిల్లాల్లో అంటే..
Gold: పోలీసుల తనిఖీలు.. 18 కేజీల బంగారం పట్టివేత
Waqf Bill: వక్ఫ్ సవరణ చట్టంపై వాదనలు.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
K Ram Mohan Naidu: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుని అభినందించిన సీఎం చంద్రబాబు
తండ్రికి తలకొరివి పెట్టిన కూతురు
AP Govt: ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్ జారీ చేసిన ఏపీ ప్రభుత్వం
For AndhraPradesh News And Telugu News