వీర్నాల టోపీ శ్రీను హత్యకేసులో తొమ్మిది మంది నిందితులు అరెస్టు
ABN , Publish Date - Mar 27 , 2025 | 01:11 AM
జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో 21న రాత్రి జరిగిన వీర్నాల టోపీ శ్రీను హత్యకేసులో 9 మంది నిందితులను అరెస్టు చేసినట్టు డీఎస్పీ రాజా మీడియాకు తెలిపారు. ఈ మేరకు బుధవారం ఇనకుదురుపేట పోలీసు స్టేషన్‌లో నిందితులను మీడియా ప్రతినిధులకు చూపించారు. అనంతరం మాట్లాడారు.

మచిలీపట్నం టౌన్, మార్చి 26 (ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో 21న రాత్రి జరిగిన వీర్నాల టోపీ శ్రీను హత్యకేసులో 9 మంది నిందితులను అరెస్టు చేసినట్టు డీఎస్పీ రాజా మీడియాకు తెలిపారు. ఈ మేరకు బుధవారం ఇనకుదురుపేట పోలీసు స్టేషన్‌లో నిందితులను మీడియా ప్రతినిధులకు చూపించారు. అనంతరం మాట్లాడారు. 21న రాత్రి 8 గంటలకు వర్రెగూడెం వాటర్ ట్యాంకు వద్ద టోపీ శ్రీనును సుంకర ఉదయ వెంకటరమణ, మెరుగు రోహిత్ మరో ఏడుగురితో కలిసి శ్రీనివాసరావుతో గొడవపడ్డారు. ఉదయ వెంకటరమణ భార్య మాలిన్ భర్తతో విడిపోయి మృతుడు టోపీ శ్రీనివాసరావుతో సంబంధం పెట్టుకుంది. ఇది మనసులో పెట్టుకుని ఉదయ వెంకటరమణ 9 నెలల క్రితం టోపీ శ్రీనివాసరావును చింతచెట్టు సెంటర్‌లో కొట్టాడు. దీంతో శ్రీనివాసరావు ఇనకుదురు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో టోపీ శ్రీనివా్‌సను సుంకర వెంకటరమణ చంపాలనే ఉద్దేశంతో మేనమామ కొడుకు మెరుగు రోహిత్, మెరుగు నాగదుర్గాప్రసాద్‌తో కలిసి క్రికెట్ బ్యాట్, ఇనుప రాడ్డు, కర్రలతో ఇష్టమొచ్చినట్టు కొట్టాడు. ఆ దెబ్బలు తగిలిన శ్రీనివాసరావు చనిపోగా మిగిలిన నిందితులు షేక్ సాజిద్ అలియాస్ సజ్జు, మహమ్మద్ సుజీ అబ్బాస్ అలియాస్ గౌసియా, మహమ్మద్ ఇలియాస్, వైశెట్టి శ్రీవాసు, షేక్ రహమాన్ అలియాస్ బుడ్డా, బడే పూర్ణచంద్రరావు అలియాస్ నాని టోపీ శ్రీనివాసరావును చంపండ్రా అంటూ కేకలేశారు. టోపీ శ్రీనివాసరావు స్నేహితుడు భద్రి ఇంటికొచ్చి ఇంటి వద్ద ఉన్న రామలక్ష్మికి చెప్పాడు. రామలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేయగా ఎస్‌ఐ కేసు నమోదు చేశారు. తరువాత సీఐ పరమేశ్వరరావు, ఎస్పీ గంగాధరరావు, డీఎస్పీ సీహెచ్ రాజు ఆధ్వర్యంలో చిలకలపూడి సీఐ నబీ, రాబర్టుసన్ సీఐ ఏసుబాబు, గూడూరు, బంటుమిల్లి, మచిలీపట్నం, ఇనకుదురు ఎస్‌ఐలు దర్యాప్తు చేశారు. ఐదు టీమ్‌లుగా విడిపోయి నిందితులను అరెస్టు చేశారు. ఈ సందర్భంగా సుంకర వెంకటరమణ, మెరుగు రోహిత్, మెరుగు నాగదుర్గాప్రసాద్, షేక్ సాజిద్, మమహ్మద్ సుజీ అబ్బాస్, ఇలియాస్, వైశెట్టి శ్రీవాసు, షేక్ రహమాన్, బడే పూర్ణచంద్రరావుపై కేసు నమోదు చేసి కోర్టుకు హాజరు పరిచారు.