Share News

Diabetes: చక్కెర వ్యాధిని నియంత్రించే స్మార్ట్‌ కుక్కర్‌..!

ABN , Publish Date - Apr 26 , 2025 | 05:40 AM

మధుమేహం మరియు ఊబకాయం ఉన్నవారికోసం బాపట్లలోని శాస్త్రవేత్త దోనేపూడి సందీప్ రూపొందించిన స్మార్ట్ కుక్కర్‌కు పేటెంట్ లభించింది. ఇది గ్లైసెమిక్ ఇండెక్స్‌ను తగ్గించి రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది.

Diabetes: చక్కెర వ్యాధిని నియంత్రించే స్మార్ట్‌ కుక్కర్‌..!

బాపట్ల శాస్త్రవేత్త అద్భుత ఆవిష్కరణకు పేటెంట్‌

మధుమేహ రోగులు,ఊబకాయులకు ఉపయుక్తం

బాపట్ల, ఏప్రిల్‌ 25(ఆంధ్రజ్యోతి): మధుమేహ రోగులు, ఊబకాయులకు ఉపయోగపడేలా రూపొందించిన స్మార్ట్‌ కుక్కర్‌కు పేటెంట్‌ లభించింది. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ పరిధిలోని బాపట్ల వ్యవసాయ కళాశాలకు చెందిన సీనియర్‌ శాస్త్రవేత్త దోనేపూడి సందీప్‌ ఈ స్మార్ట్‌ కుక్కర్‌ను రూపొందించారు. దేశంలోనే తొలిసారిగా రూపొందించిన దీనికి ఇటీవలే పేటెంట్‌ వచ్చిందని, త్వరలో మార్కెట్‌లోకి వస్తుందని అధికారులు తెలిపారు. గ్లైసెమిక్‌ ఇండెక్స్‌ (జీఐ) స్థాయిలు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయి. ఈ కుక్కర్‌లో బియ్యాన్ని ఉడికించడం వల్ల జీఐ తగ్గుతుంది. దీంతో మధుమేహులకు చక్కెర స్థాయిలు అదుపు లో ఉంటాయి. అన్నంలోని జీఐను తగ్గించి నెమ్మదిగా జీర్ణమయ్యేలా చేయడమే డయాబెటిక్‌ స్మార్ట్‌ రైస్‌ కుక్కర్‌ ప్రత్యేకత అని సందీప్‌ తెలిపారు. ఇందులో వండిన అన్నం తింటే అరుగుదల నిధానంగా జరిగి రక్తంలో చక్కెరస్థాయి పెరగకుండా చేస్తుందని చెప్పారు. జీవక్రియ మెరుగవుతుందని, శరీర బరువును నియంత్రణలో ఉంచు తుందని పేర్కొన్నారు. ఈ కుక్కర్‌ను మొబైల్‌ యాప్‌తో నియంత్రించవచ్చన్నారు. గతేడాది సందీప్‌ రూపొందించిన రెండు పరికరాలకు కూడా పేటెంట్‌ లభించింది.


Also Read:

ఇలా నడిస్తే బోలెడు ప్రయోజనాలు..

లామినేషన్ మిషన్‌ను ఇలా వాడేశాడేంటీ...

ప్రధాని నివాసంలో కీలక సమావేశం..

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - Apr 26 , 2025 | 05:40 AM