AP Property Tax Rebate Now Till April 30: ఆస్తిపన్ను వడ్డీ రాయితీ మరో నెల పొడిగింపు
ABN , Publish Date - Apr 11 , 2025 | 05:28 AM
2024-25 ఆర్థిక సంవత్సరం ఆస్తిపన్ను బకాయిలపై వడ్డీ రాయితీ గడువును ఏప్రిల్ 30 వరకు పొడిగించారు. పండుగల సెలవుల కారణంగా ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోలేకపోయిన పౌరుల కోసం మున్సిపల్ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది
అమరావతి, ఏప్రిల్ 10(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని అన్ని పట్టణ స్థానికసంస్థల్లో 2024-25 ఆర్థిక సంవత్సరం వరకు ఆస్తిపన్ను బకాయిలపై వడ్డీలో 50 శాతం మాఫీకి గడువును ఈనెల 30 వరకు పొడిగించారు. ఈ మేరకు మున్సిపల్‌శాఖ ఉత్తర్వులు జారీచేసింది. 2024-25కు సంబంధించి ఆస్తి పన్ను బకాయిలు మార్చి 31 లోగా చెల్లిస్తే వడ్డీలో 50 శాతం రాయితీ ఇస్తామని మున్సిపల్‌శాఖ మార్చి 25న ఉత్తర్వులు జారీచేసింది. అయితే మార్చి 25, 31 తేదీల మధ్య రంజాన్, ఉగాది పండుగ సెలవుల వల్ల ఆ అవకాశాన్ని ఎక్కువమంది ఉపయోగించుకోలేకపోయారు. దీంతో ఆ అవకాశాన్ని ఈనెలాఖరు వరకు ప్రభుత్వం పొడిగించింది.