Share News

PSR Anjaneyulu: బెయిల్‌ కోసం కోర్టులో పీఎస్ఆర్‌ పిటిషన్‌

ABN , Publish Date - Apr 26 , 2025 | 05:36 AM

నటి కాదంబరి వేధింపుల కేసులో రిమాండ్‌లో ఉన్న పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు బెయిల్‌ కోరుతూ కోర్టును ఆశ్రయించారు. జైలు భద్రతా కారణాల దృష్ట్యా ఆయనకు ప్రత్యేక సెల్‌ మాత్రమే కేటాయించగలమని అధికారులు కోర్టుకు తెలిపారు.

PSR Anjaneyulu: బెయిల్‌ కోసం కోర్టులో పీఎస్ఆర్‌ పిటిషన్‌

విజయవాడ, ఏప్రిల్‌ 25 (ఆంధ్రజ్యోతి): ముంబై సినీనటి కాదంబరి జెత్వానీపై వేధింపుల కేసులో విజయవాడ జిల్లా కారాగారంలో ఉన్న నిఘా విభాగం మాజీ చీఫ్‌ పీఎ్‌సఆర్‌ ఆంజనేయులు తనకు బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ కోర్టును ఆశ్రయించారు. ఆయన తరఫున న్యాయవాది విష్ణువర్ధన్‌ ఈ పిటిషన్‌ను రెండో అదనపు జిల్లా కోర్టులో దాఖలు చేశారు. ఈ వ్యాజ్యం శుక్రవారం మహిళా సెషన్స్‌ జడ్జి కోర్టుకు బదిలీ అయింది. విచారణను కోర్టు ఈనెల 29వ తేదీకి వాయిదా వేసింది.

ప్రత్యేక సెల్‌ మాత్రమే ఇవ్వగలం

భద్రత దృష్ట్యా పీఎస్ఆర్‌ఆంజనేయులుకు జైలులో ప్రత్యేక సెల్‌ మాత్రమే కేటాయించగలమని బెజవాడ జిల్లా జైలు అధికారులు కోర్టుకు తెలిపారు. తనకు జైలులో ప్రత్యేక గది, మంచం కేటాయించడంతోపాటు ఇంటి నుంచి భోజనం, తాగునీరు, మందులను అనుమతించాలని కోరుతూ ఆయన మూడో అదనపు జ్యుడిషియల్‌ మేజిస్ట్రేట్‌ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై కోర్టు జైలు అధికారులకు నోటీసు జారీ చేసింది. దీనిపై వారు న్యాయస్థానానికి నివేదిక సమర్పించారు. భద్రతా కారణాల వల్ల పీఎ్‌సఆర్‌కు ప్రత్యేక సెల్‌ కేటాయించగలమని.. మిగిలిన వసతులు మాత్రం కల్పించలేమని పేర్కొన్నారు.


Also Read:

ఇలా నడిస్తే బోలెడు ప్రయోజనాలు..

లామినేషన్ మిషన్‌ను ఇలా వాడేశాడేంటీ...

ప్రధాని నివాసంలో కీలక సమావేశం..

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - Apr 26 , 2025 | 06:58 AM