Share News

Supreme Court: ఆ అధికారిని వదిలిపెట్టం

ABN , Publish Date - Apr 22 , 2025 | 04:58 AM

సుప్రీంకోర్టు ఒక అధికారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఆయనను క్షమించబోమని, జైలుకు పంపే అవకాశం ఉందని హెచ్చరించింది. 2014లో ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నతమైన ఆదేశాలను ఉల్లంఘించినందుకు ఆయనపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

Supreme Court: ఆ అధికారిని వదిలిపెట్టం

జైలులో ప్రభుత్వ ఆతిథ్యం స్వీకరించాల్సిందే

కోర్టు ప్రతిష్ఠతో చెలగాటం ఆడితే క్షమించబోం

చట్టాన్ని గౌరవించనివారికి మినహాయింపు ఇవ్వం

ఇళ్ల కూల్చివేతలో బాధితుల పిల్లలు కనిపించలేదా?

ఉమ్మడి ఏపీ నాటి ఓ కేసులో సుప్రీంకోర్టు ఆగ్రహం..

కూల్చిన ఇళ్లకు భారీ జరిమానా విధిస్తామని హెచ్చరిక

న్యూఢిల్లీ, గుంటూరు, ఏప్రిల్‌ 21 (ఆంధ్రజ్యోతి) : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో విభజన సమయంలో జరిగిన ఓ ఘటనలో అప్పటి తహసీల్దార్‌పై (ప్రస్తుతం డిప్యూటీ కలెక్టరు హోదాలో అమరావతి జీఏడీ ప్రొటోకాల్‌ డైరెక్టరుగా ఉన్నారు) సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ అధికారిని క్షమించేది లేదని, ఆయనను వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. ఆ అధికారి కోర్టు పరిసరాల్లోనే ఉన్నారని ఆయన తరఫు న్యాయవాది తెలపగా, ‘‘ఆయన అమరావతి జైలులో ఉండదలుచుకున్నారా? లేదా తిహాడ్‌ జైలుకు రావాలి అనుకుంటున్నారా? చెప్పమనండి.’’ అని న్యాయమూర్తి జస్టిస్‌ బీఆర్‌ గవాయి హెచ్చరించారు. కేసు పూర్వపరాలివీ.. గుంటూరులో ఒక ప్రాంతం (అడవి తక్కెళ్లపాడు)లో ఆక్రమణలను తొలగించవద్దని 2013 డిసెంబరు 11న హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఆ ఆదేశాలను ఉల్లంఘించి 2014 జనవరిలో అప్పట్లో తహసీల్దార్‌గా ఉన్న ఆ అధికారి వాటిని తొలగించారు. దీనిని హైకోర్టు కోర్టు ధిక్కారం కింద పరిగణించి, రెండు నెలల జైలు శిక్ష విధించింది. దానిపై ఆయన వేసిన అప్పీలును హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ కొట్టివేసింది. దీంతో ఆయన సుప్రీంకోర్టు తలుపు తట్టారు.


ఆయన పిటిషన్‌ సోమవారం విచారణకు వచ్చింది. ఆ అధికారి హైకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించడంపై జస్టిస్‌ గవాయ్‌ తీవ్రంగా స్పందించారు. కోర్టును ధిక్కరించి 80 మంది పోలీసులను తీసుకుని కూల్చివేతలు జరిపించడానికి వెళతారా? అక్కడ ఎన్ని ఇళ్లు కూల్చారు? అంటూ ఆగ్రహించింది. ‘‘హైకోర్టు ప్రతిష్ఠతో చెలగాటమాడితే ఎవరినైనా జైలులో వేస్తాం. ఆయన తనను తాను హైకోర్టు కంటే ఉన్నత వ్యక్తిగా భావిస్తున్నారా? చట్టాన్ని గౌరవించని వారికి ఎలాంటి మినహాయింపు ఉండదు.’’ అని బెంచ్‌ వ్యాఖ్యానించింది. తనను ఆరోపణల నుంచి విముక్తి చేయాలని, పిటిషనర్‌కు ఇద్దరు పిల్లలున్నారని ఆయన తరఫు న్యాయవాది అభ్యర్థించగా, ‘‘ఇళ్లు కూల్చివేతల సమయంలో బాధితుల పిల్లల గురించి మీరు ఆలోచించారా? వారి సంగతేమిటి?.’’ ఆయన జైలులో ప్రభుత్వ అతిఽఽథ్యం స్వీకరించాల్సిందే,’’ అని హెచ్చరించింది. ఆయన 48 గంటలు కస్టడీలో ఉంటే ఉద్యోగం పోతుందని తెలిపింది. ‘‘మేం ఆయన హోదానూ తగ్గించగలం. మళ్లీ తహసీల్దార్‌ కావాలని అనుకుంటున్నారేమో అడగండి.’’ అని జస్టిస్‌ గవాయ్‌ వ్యాఖ్యానించారు. ఆయన కూల్చివేసిన ఇళ్లకు భారీ జరిమానా విధిస్తామని హెచ్చరించారు. అయితే, ఆయన పిటిషన్‌పై విచారణ కొనసాగించడానికి ఆయన అంగీకరించారు. ‘‘సాధారణంగా ఇలాంటి పిటిషన్లు విచారణకు స్వీకరించం. అయినా కొంత సహనం పాటిస్తూ నోటీసు జారీ చేస్తున్నాం. వచ్చేనెల ఐదో తేదీ వరకు హైకోర్టు ఆదేశాలపై స్టే విధిస్తున్నాం. బాధితులకు న్యాయసేవల అథారిటీ నుంచి న్యాయ సహాయం అందిస్తాం’’ అని వెల్లడించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

Post Office: ఏమిటి.. ఇన్నీ మంచి పథకాలా..

10th Class Result: 10వ తరగతి పరీక్ష ఫలితాలు.. విడుదల ఎప్పుడంటే..

Business: ఈ పథకంలో జస్ట్ రూ. 45 పెట్టుబడిగా పెట్టండి.. రూ. 25 లక్షలు మీ సొంతం

Rs 500 Notes: రూ. 500 నోట్లపై కీలక అప్ డేట్: కేంద్రం వార్నింగ్

Pope Francis: పోప్ ఫ్రాన్సిస్ మృతి.. స్పందించిన ప్రధాని మోదీ

వాటికన్ సిటీలో పోప్ ఫ్రాన్సిస్ (21-04-2025) సోమవారం మృతి చెందారు.

RVNL: దేశంలోనే తొలిసారి... అతిపొడవైన 14.57 కి.మీ.సొరంగం పూర్తి

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - Apr 22 , 2025 | 04:58 AM