Share News

Teacher Recruitment: జగన్‌ ఒక్క టీచర్‌ పోస్టూ భర్తీ చేయలేదు

ABN , Publish Date - Apr 22 , 2025 | 05:07 AM

పార్టీ నేతగా జగన్‌ రీతి మారడం లేదని, 11 సీట్లకు పరిమితమయ్యిన జగన్‌కు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకపోతే ఇంకా తన శైలిలో మార్పు లేదని టీడీపీ చీఫ్ విప్ పంచుమర్తి అనురాధ విమర్శించారు. ఆర్థికం లేదా ఉపాధ్యాయ నియామకాల విషయంలో ఆయన పాలనలో జోక్యాలు చేసిన విషయంలో జగన్‌పై విమర్శలు పెరిగాయి.

Teacher Recruitment: జగన్‌ ఒక్క టీచర్‌ పోస్టూ భర్తీ చేయలేదు

ఈ విషయంలో పేటెంట్‌ టీడీపీదే: పంచుమర్తి

అమరావతి, ఏప్రిల్‌ 21 (ఆంధ్రజ్యోతి): జగన్‌రెడ్డిని కేవ లం 11 సీట్లకు పరిమితం చేస్తూ ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చినా, ఆయనకు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా తరిమేసినా జగన్‌ తీరు మా త్రం మారడం లేదని శాసనమండలిలో చీఫ్‌ విప్‌, ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ విమర్శించారు. సోమవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘పార్టీ మొత్తం ఖాళీ అవుతున్నా ఆత్మపరిశీలన మానేసి రాష్ట్రంలో ఏదో ఒక రాద్ధాంతం చేయడం జగన్‌ అలవాటుగా పెట్టుకున్నారు. యువతకు ఇచ్చిన మాట ప్రకారం కూటమి ప్రభుత్వం 16,347 ఉపాధ్యాయ పోస్టులతో మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ ఇస్తే జగన్‌రెడ్డి తట్టుకోలేకపోతున్నారు. సోషల్‌ మీడియాలో ఫేక్‌ డీఎస్సీ పోస్టులు అంటూ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. రాష్ట్రంలో ఎప్పుడైనా ఉపాధ్యాయ పోస్టుల భర్తీ జరిగిందంటే దాని పేటెంట్‌ రైట్‌ కేవలం టీడీపీకి మాత్రమే దక్కుతుంది. మొత్తం 1,96,000 ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేసిన ఏకైక నాయకుడు చంద్రబాబు. గౌరవప్రదమైన వృత్తిలో ఉన్న గురువులను మద్యం దుకాణాల ముందు కాపలా పెట్టించిన ఘనత, వారితో మరుగుదొడ్లను కడిగించిన చరిత్ర జగన్‌దే. ఏ ఒక్క నెల కూడా సకాలంలో టీచర్లకు జీతాలు ఇవ్వలేదు. 1998, 2018, 2019లో ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేసినట్లు వైసీపీ నేతలు సిగ్గులేకుండా ప్రచారం చేసుకుంటున్నారు. అప్పుడు అధికారంలో ఉన్నది ఎవరో జగన్‌రెడ్డి సమాధానం ఇవ్వాలి. జగన్‌ పాలనలో ఉపాధ్యాయ నియామకాలు గుండు సున్నా’ అని పంచుమర్తి విమర్శించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

Post Office: ఏమిటి.. ఇన్నీ మంచి పథకాలా..

10th Class Result: 10వ తరగతి పరీక్ష ఫలితాలు.. విడుదల ఎప్పుడంటే..

Business: ఈ పథకంలో జస్ట్ రూ. 45 పెట్టుబడిగా పెట్టండి.. రూ. 25 లక్షలు మీ సొంతం

Rs 500 Notes: రూ. 500 నోట్లపై కీలక అప్ డేట్: కేంద్రం వార్నింగ్

Pope Francis: పోప్ ఫ్రాన్సిస్ మృతి.. స్పందించిన ప్రధాని మోదీ

వాటికన్ సిటీలో పోప్ ఫ్రాన్సిస్ (21-04-2025) సోమవారం మృతి చెందారు.

RVNL: దేశంలోనే తొలిసారి... అతిపొడవైన 14.57 కి.మీ.సొరంగం పూర్తి

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - Apr 22 , 2025 | 05:07 AM