Share News

Nehanjani historic SSC result: చదువుల తల్లి నేహాంజని

ABN , Publish Date - Apr 24 , 2025 | 04:23 AM

ఆంధ్రప్రదేశ్ పదో తరగతి పరీక్షల చరిత్రలో తొలిసారిగా అన్ని సబ్జెక్టుల్లో 600కి 600 మార్కులు సాధించిన విద్యార్థినిగా కాకినాడకు చెందిన యాళ్ల నేహాంజని అరుదైన రికార్డు నెలకొల్పింది. సివిల్‌ ఇంజనీర్‌ తండ్రి, గృహిణి తల్లి కొడలిగా నేహాంజని కుటుంబం గర్వపడే స్థాయిలో ఆమె ఈ విజయం సాధించింది.

Nehanjani historic SSC result: చదువుల తల్లి నేహాంజని

నూరు శాతం స్ర్టైక్‌ రేట్‌తో రికార్డు

అన్ని సబ్జెక్టుల్లోనూ వందకు వంద

టెన్త్‌లో ఇన్ని మార్కులు ఇదే తొలిసారి

కాకినాడ విద్యార్థిని అరుదైన ఘనత

రోజూ 17 గంటలు పుస్తకాలతోనే కుస్తీ

కాకినాడ, ఏప్రిల్‌ 23(ఆంధ్రజ్యోతి): పదో తరగతి పరీక్షా ఫలితాల్లో అన్ని సబ్జెక్టుల్లో నూటికి నూరు మార్కులతో మొత్తం 600 తెచ్చుకోవడం రాష్ట్ర చరిత్రలోనే అరుదైన రికార్డు. కాకినాడకు చెందిన యాళ్ల నేహాంజని ఎవరికీ సాధ్యం కాని రీతిలో ఈ అరుదైన ఫీట్‌ సాధించింది. నూరు శాతం స్ట్రైక్‌ రేట్‌తో పదో తరగతి ఫలితాల రికార్డులను తిరగరాసింది. కాకినాడ గొడారిగుంట లక్ష్మీ హాస్పిటల్‌ సమీపంలోని వసంత విహార్‌లో నివాసం ఉంటున్న యాళ్ల శ్రీనివాసరావు, గంగాభవానీ దంపతుల చిన్న కుమార్తె నేహాంజని. తండ్రి సివిల్‌ ఇంజనీర్‌ కాగా, తల్లి గృహిణి. ప్రస్తుతం శ్రీనివాసరావు ఉద్యోగ రీత్యా గుజరాత్‌లో ఉంటున్నారు. తండ్రి ఆశయాలకు తగ్గట్టుగానే ఇటీవల విడుదలైన ఇంటర్‌ ఫలితాల్లో పెద్ద కుమార్తె 900కు పైగా మార్కులు సాధించగా.. బుధవారం విడుదలైన పదో తరగతి ఫలితాల్లో నేహాంజని స్టేట్‌ టాపర్‌గా నిలిచింది.


Also Read:

ఇలా నడిస్తే బోలెడు ప్రయోజనాలు..

లామినేషన్ మిషన్‌ను ఇలా వాడేశాడేంటీ...

ప్రధాని నివాసంలో కీలక సమావేశం..

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - Apr 24 , 2025 | 04:23 AM