Share News

రైతు సంక్షేమమే ధ్యేయం

ABN , Publish Date - Apr 22 , 2025 | 12:38 AM

రైతుల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉందని రోడ్లు, భవనాలు శాఖ మంత్రి బీసీ జనార్దనరెడ్డి అ న్నారు.

 రైతు సంక్షేమమే ధ్యేయం

ఫ మంత్రి బీసీ జనార్దనరెడ్డి

ఫ రైతులకు వ్యవసాయ

యంత్ర పరికరాలు పంపిణీ

కోవెలకుంట్ల, ఏప్రిల్‌ 21 (ఆంధ్రజ్యోతి) : రైతుల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉందని రోడ్లు, భవనాలు శాఖ మంత్రి బీసీ జనార్దనరెడ్డి అ న్నారు. సోమవారం పట్టణంలోని వ్యవసాయ మార్కెట్‌ కార్యాలయంలో అవుకు, కొలిమిగుం డ్ల, బనగానపల్లె, సంజామల, కోవెలకుంట్ల మండలాలకు చెందిన సుమారు 200మంది రైతులకు వివిధ వ్యవసాయ యంత్ర పరిక రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మం త్రి మాట్లాడుతూ రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటుందనే ఆలోచనతో వ్యవసాయ యంత్రీకరణ పరికరాలు సబ్సిడీతో అందిస్తున్నా మన్నారు. ఈ పంట నమోదు చేసుకోకంటే ప్రకృతి వైపరీతల్యాలు సంభవించినప్పుడు రైతులు తీవ్రంగా నష్టపోతారన్నారు. ఖచ్చి తంగా ప్రతి ఒక్క రైతు ఈపంట నమోదు చేసుకోవాలని మంత్రి సూచించారు. ఈ సం దర్భంగా రైతులతో వ్యవసాయ సాగులో మెళకువల గురించి కొంత మంది రైతులతో మాట్లాడించారు. సమావేశంలో జిల్లా వ్యవ సాయాధికారి మురళీక్రిష్ణ, నంద్యాల ఏడీ రాజశేఖర్‌, కోవెలకుంట్ల ఏడీ సుధాకర్‌, ఐదు మండలాల ఏవోలు, కో వెలకుంట్ల మాజీ సింగి ల్‌విండో అధ్యక్షులు గు వ్వల సుబ్బారెడ్డి, మా జీ మార్కెట్‌యార్డు చైౖర్మ న గడ్డం నాగేశ్వర్‌ రెడ్డి, సౌదరదిన్నె సుబ్బారెడ్డి, వల్లంపాడు సర్పంచ జగ దీశ్వర్‌రెడ్డి, కలుగొట్ల అ ర్జునరెడ్డి, మండల టీడీపీ అధ్యక్షులు అమడాల మ ద్దిలేటి, ఎంపీడీవో రమణ మూర్తి, తహసీల్దారు ప వనకుమార్‌రెడ్డి, మార్కె ట్‌యార్డు సెక్రటరీ నా రా యణస్వామి, లింగాల నాయుడు, చిన్న కొప్పెర్ల బుచ్చన్న, అఽధికారులు పాల్గొన్నారు.

పలు ప్రభుత్వ కార్యాలయాల్లో తనిఖీ

పట్టణంలోని పలు ప్రభుత్వ కార్యాలయాల్లో రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దనరెడ్డి సోమవారం తనిఖీ చేశారు. సచివాలయం-5, డీఆర్‌డీఏ వెలుగు కార్యాలయం, హెల్త్‌ సెంటర్లను తనిఖీ చేశారు. విధుల్లో బాధ్యతారాహిత్యంగా ఉన్న అధికారుల పై మంత్రి మండిపడ్డారు. విధులకు హాజరవు తున్న అధికారుల వివరాలు పరిశీలించారు. ప్రతి ఉద్యోగి విధి నిర్వహణలో బాధ్యతగా మెలగాలని, తమకు కేటాయించిన విధులు సక్రమంగా నిర్వహించి ప్రజలకు జవాబుదారీగా నిలవాలని ఆయా అధికారులకు మంత్రి సూచించారు. హెల్త్‌సెం టరు-2ను పరిశీలించిన అనంతరం అక్కడి అపరిశుభ్రతపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే రోగులకు స్థానికంగా అంది స్తున్న సేవల పై సిబ్బందిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. మండలంలో భూసర్వే జరుగుతున్న తీరుపై స్తానిక తహసీల్దారు పవనకుమార్‌ను ఆరా తీసి వివరాలు తెలుసుకున్నారు. ఆయన వెంట ఎంపీడీవో వర ప్రసాదరావు, తహసీల్దారు పవన, సీఐ హనుమంతనాయక్‌, ఎస్‌ఐ మల్లిఖార్జునరెడ్డి, సంజామల ఎస్‌ఐ రమణయ్య, రేవనూరు ఎస్‌ఐ భూపాలుడు, వెలుగు ఏపీయం శేఖర్‌, ఉపాధి హామీ పథకం ఏపీవో శ్రీకళారెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Apr 22 , 2025 | 12:38 AM