AP tomato price drop: టమాటా ధర పతనం
ABN , Publish Date - Apr 18 , 2025 | 04:26 AM
రాష్ట్ర మార్కెట్లలో టమాటా ధర క్వింటాకు రూ.800–1,480 వరకు పడిపోవడంతో రైతులు తీవ్ర నష్టాల్లో ఉన్నారు. కనీస మద్దతు ధరగా రూ.1,500 ప్రకటించాలని డిమాండ్ చేస్తూ, కొంత ఉపశమనం కలిగించేందుకు మార్కెటింగ్ శాఖ రైతుబజార్లలో టమాటా విక్రయాలను ప్రారంభించింది.
క్వింటాలుకు గరిష్ఠంగా 1,480లోపే
గత వారంలో 2,300 వరకు పలికిన రేటు
గిట్టుబాటుకాక అల్లాడుతున్న రైతులు
కనీస మద్దతు రూ.1,500గా ప్రకటించాలని డిమాండ్
హోల్‌సేల్‌గా కొంటున్న మార్కెటింగ్ శాఖ
రైతు బజార్లలో సాధారణ ధరకు విక్రయం
అమరావతి, ఏప్రిల్17(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర మార్కెట్లలో టమాటా ధర దారుణంగా పడిపోయింది. గిట్టుబాటు ధరలేక రైతులు అల్లాడుతున్నారు. మార్కెట్లలో క్వింటా కనీస ధర రూ.800గా పలుకుతోంది. గరిష్ఠ ధర రూ.1,480కు మించడంలేదు. గత వారం రోజుల్లో సగటు ధర రూ.1,200లోపే ఉంది. వారం క్రితం గరిష్ఠ ధర రూ.1,800 నుంచి రూ.2,300 వరకు ఉంది. ఐదారు మార్కెట్ యార్డుల్లో ఈ-నామ్ పద్ధతిలో వేలం జరుగుతున్నా.. ధర పుంజుకోలేదు. ఒడిశా, హరియాణా, హిమాచల్‌ప్రదేశ్‌లో మినహా టమాటాను పండించే రాష్ట్రాల్లో ధరలు ఆశాజనకంగా లేవు. ఈసీజన్‌లో సాగు పెరగడం, పంట చివరికి రావడం, నాణ్యత లేకపోవడం వంటి కారణాల వల్ల టమాటా ధరలు పడిపోయినట్లు వ్యాపారులు చెబుతున్నారు. టమాటా నాణ్యతను బట్టి బహిరంగ మార్కెట్‌లో కిలో రూ. 10-20 మధ్య అమ్ముతున్నారు. తమను ఆదుకునేందుకు క్వింటాకు కనీస మద్దతు ధర రూ. 1,500 ప్రకటించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. అయితే ధర తగ్గి, ఇబ్బందులు పడుతున్న రైతులను ఆదుకునేందుకు మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశాలతో మార్కెటింగ్‌శాఖ అధికారులు కొద్ది మొత్తంలో టమాటాలను హోల్‌సేల్‌గా కొని, రైతుబజార్లలో సాధారణ ధరకు విక్రయిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
National Testing agency: జేఈఈ మెయిన్ సెషన్ - 2 ఫైనల్ కీ విడుదల
AP Ministers: దెయ్యాలు.. వేదాలు వల్లించినట్లు..
AP High Court: బోరుగడ్డ అనిల్‌కు గట్టి షాక్
Rain Alert: తెలంగాణలో కాసేపట్లో వర్షం.. ఉరుములతో కూడిన వానలు.. ఏ జిల్లాల్లో అంటే..
Gold: పోలీసుల తనిఖీలు.. 18 కేజీల బంగారం పట్టివేత
Waqf Bill: వక్ఫ్ సవరణ చట్టంపై వాదనలు.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
K Ram Mohan Naidu: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుని అభినందించిన సీఎం చంద్రబాబు
తండ్రికి తలకొరివి పెట్టిన కూతురు
AP Govt: ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్ జారీ చేసిన ఏపీ ప్రభుత్వం
For AndhraPradesh News And Telugu News