TTD, Tirumala: టీటీడీలో వేగంగా డిజిటలైజేషన్
ABN , Publish Date - Apr 22 , 2025 | 04:36 AM
టీటీడీకి చెందిన పురాతన పత్రాల డిజిటలైజేషన్ పనులు జోరుగా సాగుతున్నాయి. ఇప్పటివరకు 2.21 కోట్ల పేజీలను స్కాన్ చేయగా, మిగిలిన రికార్డుల కోసం మరో రూ.3 కోట్ల నిధులను విడుదల చేశారు.
పాత రికార్డుల సంరక్షణకు చర్యలు
ఇప్పటికే 2.21 కోట్ల పేజీల స్కాన్
ఇలాగే మిగిలిన రికార్డులు కూడా
తాజాగా టీటీడీ రూ.3 కోట్లు విడుదల
తిరుమల, ఏప్రిల్ 21(ఆంధ్రజ్యోతి): టీటీడీలోని పాత పత్రాల డిజిటలైజేషన్ పనులు వేగంగా సాగుతున్నాయి. ఇప్పటి వరకు దాదాపు 2.21 కోట్ల పేజీలను స్కాన్ చేశారు. మిగిలిన రికార్డులను కూడా వేగంగా డిజిటలైజేషన్ చేసేందుకు టీటీడీ అధికారులు ప్రత్యేక దృష్టిసారించారు. తాజాగా మరో రూ.3 కోట్ల నిధులను విడుదల చేసి ఈ ప్రక్రియను పూర్తిచేయాలని టీటీడీ ఆదేశించింది. వేల ఏళ్ల చరిత్ర గల తిరుమల క్షేత్ర పరిపాలన బాధ్యతలను 1843 వరకు ఎందరో రాజులు, ఆర్కాటు నవాబులు, ఈస్టిండియా కంపెనీ ప్రతినిధులు, బ్రిటిష్ అధికారులు నిర్వహించినట్టు చరిత్ర ద్వారా తెలుస్తోంది. 1933 వరకు క్షేత్ర పాలనను మహంతులు చూసుకోగా, ఆ తర్వాత బ్రిటిష్ ప్రభుత్వం తిరుమల తిరుపతి దేవస్థానంతో పాటు ధర్మకర్తల మండలిని ఏర్పాటు చేసింది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత పూర్తిస్థాయిలో టీటీడీ ఏర్పాటైంది. 1980 ముందు వరకు టీటీడీలో ప్రతిదీ పేపర్‌పైనే జరిగేది. అయితే కాలం గడుస్తున్న కొద్దీ ఎంతో విలువైన రికార్డులు పాడైపోతూ వస్తున్నాయి. దీంతో పాత రికార్డులన్నీ సంరక్షించేందుకు డిజిటలైజేషన్ చేయాలని టీటీడీ నిర్ణయించింది.
ఈ డిజిటలైజేషన్ ద్వారా పత్రాల రక్షణ, సంరక్షణ, స్కానింగ్, మైక్రోఫిల్మింగ్ వంటి కీలక చర్యలకు పూనుకుంది. ఈ పనుల నిర్వహణ కోసం ప్రభుత్వానికి చెందిన ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ (ఏపీటీఎ్‌స)ను టీటీడీ అధికారికంగా నియమించింది. ఏపీటీఎస్ టెండర్ ప్రక్రియ ద్వారా హైదరాబాద్‌కు చెందిన ఐరన్ మౌంటెన్ ఇండియా ప్రైవేట్ లిమిడెట్ 2023 ఆగస్టు నుంచే డిజిటలైజేన్ ప్రక్రియను ప్రారంభించింది. తొలుత 1.60 కోట్ల పేజీలను స్కాన్ చేయాలని అంచనా వేసినప్పటికీ ఇప్పటి వరకు దాదాపు 2.21 కోట్ల పేజీలను స్కాన్ చేశారు. ఇంకా స్కాన్ చేయాల్సిన రికార్డులు చాలానే ఉన్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
Post Office: ఏమిటి.. ఇన్నీ మంచి పథకాలా..
10th Class Result: 10వ తరగతి పరీక్ష ఫలితాలు.. విడుదల ఎప్పుడంటే..
Business: ఈ పథకంలో జస్ట్ రూ. 45 పెట్టుబడిగా పెట్టండి.. రూ. 25 లక్షలు మీ సొంతం
Rs 500 Notes: రూ. 500 నోట్లపై కీలక అప్ డేట్: కేంద్రం వార్నింగ్
Pope Francis: పోప్ ఫ్రాన్సిస్ మృతి.. స్పందించిన ప్రధాని మోదీ
వాటికన్ సిటీలో పోప్ ఫ్రాన్సిస్ (21-04-2025) సోమవారం మృతి చెందారు.
RVNL: దేశంలోనే తొలిసారి... అతిపొడవైన 14.57 కి.మీ.సొరంగం పూర్తి
For More Andhra Pradesh News and Telugu News..