Share News

Railway Pink Book: పింక్‌ బుక్‌ జాడేదీ

ABN , Publish Date - Apr 22 , 2025 | 04:15 AM

ఈ ఏడాది రైల్వే బడ్జెట్‌ కేటాయింపులపై పింక్‌బుక్‌ విడుదలలో మూడు నెలలుగా జాప్యం జరుగుతోంది. ఈ కారణంగా ఉద్యోగ సంఘాలు, ప్రయాణికుల సంఘాల్లో అనేక అనుమానాలు నెలకొన్నాయి.

Railway Pink Book: పింక్‌ బుక్‌ జాడేదీ

మూడు నెలలు గడుస్తున్నా విడుదల ఊసేలేదు

బడ్జెట్‌లో కేటాయింపులపై ముసురుతున్న సందేహాలు

గుంతకల్లు, ఏప్రిల్‌ 21(ఆంధ్రజ్యోతి): కేంద్ర బడ్జెట్‌లో రైల్వే కేటాయింపులను జోన్ల వారీగా విశదపరచే పింక్‌బుక్‌ విడుదలలో అసాధారణ జాప్యం చోటుచేసుకుంది. ఫిబ్రవరి 1న పార్లమెంటులో కేంద్ర బడ్జెట్‌లో రైల్వే కేటాయింపులపై స్థూల ప్రకటన చేశారు. ఆ తరువాత రెండు మూడు రోజుల్లో దేశంలోని 19 జోన్లకు కేటాయింపులను తెలిపే పింక్‌ బుక్‌ను విడుదల చేయాలి. ఆ జోన్ల పరిధిలోని డివిజన్లలో కొత్త ప్రాజెక్టులు, రన్నింగ్‌ ప్రాజెక్టులకు నిధులు, కొత్త లైన్ల నిర్మాణం, ట్రాక్‌ నిర్వహణ, సేఫ్టీ పనులకు కేటాయింపులు, కొత్త రైళ్లు, రైల్వే ఉద్యోగుల సంక్షేమానికి చేపట్టే చర్యలను పారదర్శకత కోసం పింక్‌ బుక్‌లో పొందుపరుస్తారు. ఈ ఏడాది మూడు నెలలు అవుతున్నా పింక్‌ బుక్‌ ఊసే లేదు. దీంతో ఉద్యోగ, ప్రయాణికుల సంఘాల్లో సందేహాలు ముసురుతున్నాయి.

గత ఏడాది నుంచి ఆలస్యం

బడ్జెట్‌ ప్రవేశపెట్టిన తరువాత రెండు మూడు రోజుల్లో పింక్‌ బుక్‌ను విడుదల చేయడం ఆనవాయితీగా ఉండేది. కానీ గత ఏడాది 20 రోజులు ఆలస్యంగా విడుదల చేశారు. ఈ ఏడాది ఏకంగా మూడు నెలలుగా ఊసే లేదు. బడ్జెట్‌లో జోన్లకు వచ్చే కేటాయింపుల నుంచి సర్దుబాటు చేసిన నిధులు రైల్వే డివిజన్లకు వస్తాయి. పింక్‌బుక్‌ను అనుసరించి ఆర్థిక సంవత్సరంలో రైల్వే డివిజన్లలో వ్యయ కార్యాచరణ ఉంటుంది. ఉద్యోగ సంఘాలు తమ సంక్షేమంపై ఓ అవగాహనకు వచ్చేవి. కానీ ఈ ఏడాది అసాధారణ జాప్యం జరుగుతోంది. ఆలస్యానికి కారణం చెప్పకుండా, వస్తుందని మాత్రమే అధికారులు చెపుతుండడం గమనార్హం.


ఈ వార్తలు కూడా చదవండి..

Post Office: ఏమిటి.. ఇన్నీ మంచి పథకాలా..

10th Class Result: 10వ తరగతి పరీక్ష ఫలితాలు.. విడుదల ఎప్పుడంటే..

Business: ఈ పథకంలో జస్ట్ రూ. 45 పెట్టుబడిగా పెట్టండి.. రూ. 25 లక్షలు మీ సొంతం

Rs 500 Notes: రూ. 500 నోట్లపై కీలక అప్ డేట్: కేంద్రం వార్నింగ్

Pope Francis: పోప్ ఫ్రాన్సిస్ మృతి.. స్పందించిన ప్రధాని మోదీ

వాటికన్ సిటీలో పోప్ ఫ్రాన్సిస్ (21-04-2025) సోమవారం మృతి చెందారు.

RVNL: దేశంలోనే తొలిసారి... అతిపొడవైన 14.57 కి.మీ.సొరంగం పూర్తి

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - Apr 22 , 2025 | 04:15 AM