వైస్ ఎంపీపీ ఎన్నికలు ఏకగ్రీవం
ABN , Publish Date - Mar 29 , 2025 | 12:57 AM
జిల్లాలో ఏలూరు వైస్ ఎంపీపీ–2, కైకలూరు వైస్ ఎంపీపీ ఎన్ని కలు ఏకగ్రీవమయ్యాయి.

ఏలూరుసిటీ,/ కైకలూరు/ఏలూరు రూరల్, మార్చి 28 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో ఏలూరు వైస్ ఎంపీపీ–2, కైకలూరు వైస్ ఎంపీపీ ఎన్ని కలు ఏకగ్రీవమయ్యాయి. వాస్తవానికి ఈ ఎన్నికలు గురువారం జరగాల్సి ఉండగా కోరం లేక వాయిదా పడిన విషయం విదితమే. ఈనే పథ్యంలో శుక్రవారం ఆయా మండలాల్లో మండల పరిషత్ ప్రత్యేక సమావేశాలు జరిపి వైస్ ఎంపీపీ ఎన్నికలను నిర్వహించారు. రెండుచోట్ల ఒక్కొక్కరే నామినేషన్ వేయడంతో ఈ ఎన్నికలు ఏకగ్రీవమైనట్టు సంబంఽధిత అధి కారులు తెలిపారు. ఏలూరులో టీడీపీ, కైక లూరులో జనసేన అభ్యర్థులు వైస్ ఎంపీపీ లుగా విజయం సాధించారు.
కైకలూరు–మంగినేని రామకృష్ణ
కైకలూరు వైస్ ఎంపీపీ ఉప ఎన్నికలో కూటమి పార్టీ విజయం చేజిక్కించుకుంది. రెండురోజులుగా ఏర్పడిన ఉత్కంఠకు శుక్ర వారం తెరపడింది. ఏలూరు ఆర్డీవో, రిటర్నింగ్ అధికారి అచ్యుత్ అంబరీష్ ఆధ్వర్యంలో కైకలూరు వైస్ ఎంపీపీ ఉప ఎన్నిక నిర్వహిం చారు. కూటమి ఎంపీటీసీ సభ్యులు 10 మంది హాజరయ్యారు. ఉదయం 11 గంటల నుంచి ఎన్నికల ప్రక్రియ ప్రారంభించారు. మెజార్టీ సభ్యులు లేకపోవడంతో వైసీపీ ఎంపీటీసీలు డుమ్మా కొట్టారు. వైసీపీ ఎంపీటీసీలు రాక పోవడంతో ఎన్నిక నిర్వహించి వైస్ ఎంపీపీగా కైకలూరు–2 ఎంపీటీసీ జనసేన పార్టీ నుంచి మంగినేని రామకృష్ణను ఏకగ్రీవంగా ఎన్నుకు న్నారు. అనంతరం ఎన్నికల అఽధికారి రామకృష్ణతో ప్రమాణ స్వీకారం చేయించి ధ్రువీకరణపత్రం అందజేశారు. కైకలూరు టౌన్, రూరల్ సీఐలు కృష్ణ, వి.రవికుమార్ బందోబస్తు ఏర్పాట్లను నిర్వహించారు.
ఏలూరు రూరల్– నాగరాజు
ఏలూరు రూరల్ మండలం వైస్ ఎంపీపీ–2 ఎన్నిక శుక్రవారం ఏలూరు మండల పరిషత్ కార్యాలయంలో నిర్వ హించారు. గురువారం ఎన్నిక నిర్వహిం చాల్సి ఉండగా కోరం లేక శుక్రవారం ఎన్నిక నిర్వహించారు. ఇప్పటివరకు వైస్ ఎంపీపీ–2గా ప్రత్తికోళ్ళలంక ఎంపిటిసి భలే సత్యప్రసాద్ రాజీనామా చేయడంతో ఆ స్థానానికి ఎన్నిక నిర్వహించారు. సివిల్ సప్లయిస్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, ఎన్ని కల అధికారి ఎల్.దేవకీదేవి ఆధ్వర్యంలో చేతులెత్తి ఎన్నుకునే విధానం ద్వారా నిర్వహించారు. ఎంపీపీ పెన్మత్స శ్రీనివాసరాజు నాగరాజు పేరు ప్రతిపాదించగా, నరహరశెట్టి నాగమణి బలపరిచారు. దీంతో నాగరాజును వైస్ ఎంపీపీ–2గా నియమిస్తూ నియామక పత్రాన్ని అందచేశారు. అనంతరం వైస్ ఎంపీపీ–2గా ప్రమాణ స్వీకారం చేయించారు. నాగరాజు ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ఎంపీడీవో వి.శ్రీలత ప్రకటించారు. అనంతరం కొల్లేరు సంఘం సీనియర్ నాయకులు సైదు సత్యనారాయణ, తెలుగుదేశం పార్టీ రూరల్ మండల అధ్యక్షుడు నంబూరి నాగరాజు, మాజీ అధ్యక్షుడు నేతల రవి తదితరులు నాగరాజును అభినందించారు. ప్రస్తుతం నాగరాజు మాదేపల్లి–2 ఎంపీటీసీగా ఉన్నారు. వైసీపీ తరపున ఎంపీటీసీగా పోటీ చేసి గెలుపొందగా ఇటీవల అతను దెందు లూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సమక్షంలో టీడీపీలో చేరారు.