YSR Congress: నేడు వైసీపీ సలహా కమిటీ భేటీ
ABN , Publish Date - Apr 22 , 2025 | 05:03 AM
పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శైలిని నిరసిస్తూ సీనియర్ నేతలు పార్టీని వీడుతున్న నేపథ్యంలో, వైసీపీ రాజకీయ సలహా కమిటీ (పీఏసీ) సమావేశం తాడేపల్లిలో మంగళవారం జరుగుతుంది. 2019 ఎన్నికల ఓటమి తర్వాత పార్టీ పరిష్కారాలు తీసుకోలేదు, ఇప్పుడు పీఏసీ సమావేశంపై ఆసక్తి నెలకొంది.
అమరావతి, ఏప్రిల్ 21 (ఆంధ్రజ్యోతి): పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి వ్యవహార శైలిని నిరసిస్తూ సీనియర్ నేతలు ఒక్కరొక్కరుగా పార్టీని వీడుతున్న నేపథ్యంలో వైసీపీ రాజకీయ సలహా కమిటీ (పీఏసీ) సమావేశం కానుంది. జగన్ అధ్యక్షతన మంగళవారం తాడేపల్లి ప్యాలె్‌సలో ఈ భేటీ జరుగుతుంది. కమిటీ కన్వీనర్ సజ్జల రామకృష్ణారెడ్డి, రాజ్యసభ సభ్యులు గొల్ల బాబూరావు, పిల్లి సుభాష్ చంద్రబోస్, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, మాజీ మంత్రులు పీడిక రాజన్నదొర, బూడి ముత్యాలనాయుడు, పినిపె విశ్వరూప్, ముద్రగడ పద్మనాభం, చెరుకువాడ శ్రీరంగనాథరాజు, మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు తదితరులు హాజరు కానున్నారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయం పాలయ్యాక.. వైసీపీ ఇప్పటిదాకా రాజకీయపరమైన సమీక్షలు, నిర్ణయాలు చేయలేదు. మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్‌రావు, ఆర్.కృష్ణయ్య, మాజీ ఉపముఖ్యమంత్రి ఆళ్ల నాని, మాజీ విప్ సామినేని ఉదయభానుతో పాటు పార్టీలో నంబర్ టూగా చలామణి అయిన విజయసాయిరెడ్డి కూడా పార్టీని వీడడం వైసీపీ శ్రేణులను కలవరపరుస్తోంది. ఇంకా ఎవరెవరు నిష్క్రమిస్తారోనని ఆందోళన చెందుతున్నారు. ఈ తరుణంలో జరుగనున్న పీఏసీ సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారోనని ఆసక్తిగా చూస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
Post Office: ఏమిటి.. ఇన్నీ మంచి పథకాలా..
10th Class Result: 10వ తరగతి పరీక్ష ఫలితాలు.. విడుదల ఎప్పుడంటే..
Business: ఈ పథకంలో జస్ట్ రూ. 45 పెట్టుబడిగా పెట్టండి.. రూ. 25 లక్షలు మీ సొంతం
Rs 500 Notes: రూ. 500 నోట్లపై కీలక అప్ డేట్: కేంద్రం వార్నింగ్
Pope Francis: పోప్ ఫ్రాన్సిస్ మృతి.. స్పందించిన ప్రధాని మోదీ
వాటికన్ సిటీలో పోప్ ఫ్రాన్సిస్ (21-04-2025) సోమవారం మృతి చెందారు.
RVNL: దేశంలోనే తొలిసారి... అతిపొడవైన 14.57 కి.మీ.సొరంగం పూర్తి
For More Andhra Pradesh News and Telugu News..