Share News

విమానయానంపై రూ.20 లక్షల కోట్ల పెట్టుబడి

ABN , Publish Date - Apr 17 , 2025 | 03:35 AM

వచ్చే పదేళ్ల కాలంలో ఆసియా-పసిఫిక్‌, పశ్చిమాసియా ప్రాంతాల్లో మొత్తం 124 కోట్ల మంది ప్రయాణికుల రాకపోకలకు అవసరమైన వసతులు కల్పించేందుకు విమానయాన రంగంలోకి 24 వేల కోట్ల డాలర్ల...

విమానయానంపై రూ.20 లక్షల కోట్ల పెట్టుబడి

ఆసియా-పసిఫిక్‌, పశ్చిమాసియాపై ఏసీఐ అంచనా.. వచ్చే ఏడాదికి చైనాను అధిగమించనున్న భారత్‌

న్యూఢిల్లీ: వచ్చే పదేళ్ల కాలంలో ఆసియా-పసిఫిక్‌, పశ్చిమాసియా ప్రాంతాల్లో మొత్తం 124 కోట్ల మంది ప్రయాణికుల రాకపోకలకు అవసరమైన వసతులు కల్పించేందుకు విమానయాన రంగంలోకి 24 వేల కోట్ల డాలర్ల (రూ.20.40 లక్షల కోట్లు) పెట్టుబడులు రానున్నట్టు ఎయిర్‌పోర్ట్‌ కౌన్సిల్‌ ఇంటర్నేషనల్‌ (ఏసీఐ) అంచనా వేసింది. 68 కోట్ల మంది అదనపు ప్రయాణికుల సామర్థ్యం, 1.4 కోట్ల టన్నుల అదనపు కార్గో సామర్థ్యం జోడు కానున్నట్టు తాజా నివేదికలో తెలిపింది. 30 కీలక ప్రాంతీయ విమానాశ్రయాలపై ఏసీఐ సమగ్ర సర్వే నిర్వహించి ఈ నివేదిక రూపొందించింది. పదేళ్లలో చేసే ఈ భారీ పెట్టుబడి కేవలం కాంక్రీట్‌, రన్‌వేలకే పరిమితం కాదని; సమగ్ర సామాజిక, ఆర్థికాభివృద్ధికి ఈ పెట్టుబడులు దోహదపడతాయని ఏసీఐ ఆసియా-పసిఫిక్‌, పశ్చిమాసియా ప్రాంత ప్రెసిడెంట్‌ ఎస్‌జీకే కిశోర్‌ అన్నారు.


రాబోయే 5-10 సంవత్సరాల కాలంలో భారత్‌లో భారీ విమానయాన హబ్‌లు అభివృద్ధి చెందనున్నాయని ఆయన చెప్పారు. ప్రస్తుతం దేశీయ విమానయాన సంస్థల చేతిలో 1700 కొత్త విమానాలకు ఆర్డర్లున్నాయని ఆయన తెలిపారు.

విమానయానంలో 10.5% వృద్ధి: వచ్చే ఏడాది నాటికి భారత్‌ విమాన ప్రయాణికుల సంఖ్యలో 10.5ు వృద్ధితో పొరుగు దేశం చైనాను అధిగమించనున్నదని ఏసీఐ అంచనా వేసింది. ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న విమానయాన మార్కెట్లలో భారత్‌ ఒకటిగా ఉంది.

ఇవి కూడా చదవండి:

WhatsApp Security: మీ వాట్సాప్ అకౌంట్ హ్యాక్ అయిందా..ఇలా ఈజీగా మళ్లీ యాక్సెస్‌ పొందండి..

Scam Payments: మార్కెట్లోకి నకిలీ ఫోన్ పే, గూగుల్ పే యాప్స్.. జర జాగ్రత్త..

Bill Gates: వారానికి మూడు రోజేలే పని..బిల్ గేట్స్ ఆసక్తికర వ్యాఖ్యలు..

iPhone like Design: రూ.6 వేలకే ఐఫోన్ లాంటి స్మార్ట్‌ఫోన్‌.. ఫీచర్లు తెలిస్తే షాక్ అవుతారు..

Monthly Income: 50 ఏళ్ల తర్వాత నెలకు రూ.లక్ష కావాలంటే ఎంత సేవ్ చేయాలి, ఎన్నేళ్లు చేయాలి

Read More Business News and Latest Telugu News

Updated Date - Apr 17 , 2025 | 03:35 AM