Share News

Baroda MDGinext Mobile App: ఆ కస్టమర్ల కోసం బీవోబీ సరికొత్త ప్రయత్నం.. ఇక అంతా సులువే

ABN , Publish Date - Mar 22 , 2025 | 10:01 AM

Baroda MDGinext Mobile App: కస్టమర్లను ఆకట్టుకునేందుకు సరికొత్త ప్రయోగాన్ని తెరపైకి తీసుకొచ్చింది బ్యాంక్ ఆఫ్ బరోడా. క్యాష్ మేనేజ్‌మెంట్ కార్యకలాపాలు సులభంగా చేసుకునేలా ఒక ప్రత్యేకమైన మొబైల్ యాప్‌ను రూపొందించింది బీవోబీ.

Baroda MDGinext Mobile App: ఆ కస్టమర్ల కోసం బీవోబీ సరికొత్త ప్రయత్నం.. ఇక అంతా సులువే
Baroda MDGinext Mobile App

ముంబై, మార్చి 22: బ్యాంక్ ఆఫ్ బరోడా (Bank OF Baroda) కార్పొరేట్ ఖాతాదారుల కోసం సరికొత్త యాప్‌ను తెరపైకి తీసుకొచ్చింది. ‘బరోడా ఎండిజినెక్స్ట్’ (Baroda MDGinext Mobile App)పేరుతో బరోడా క్యాష్ మేనేజ్‌మెంట్ సర్వీసెస్ కింద ప్రత్యేకమైన మొబైల్ యాప్‌ను ఆవిష్కరించింది. ఈ అత్యాధునిక యాప్‌ కార్పొరేట్ సంస్థలు తమ వర్కింగ్ క్యాపిటల్‌ను, క్యాష్ ఫ్లో సమర్థవంతంగా నిర్వహించే విధానాన్ని మారుస్తుంది. కార్పొరేట్ సంస్థల క్యాష్ మేనేజ్‌మెంట్ కార్యకలాపాలను చాలా ఈజీగా చేసుకునేలా బరోడా ఎండిజినెక్స్ట్ మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. అలాగే వ్యాపారాలకు సంబంధించి సేవలను వేగవంతంగా అందించడంలో ఈ యాప్ కీలకంగా వ్యవహరించనుంది.


24/7 ఈ యాప్ కార్పొరేట్ కస్టమర్లకు అందుబాటులో ఉండనుంది. కస్టమర్లు ఎప్పుడైనా ఎక్కడి నుంచైనా ఈ యాప్‌ను వినియోగించుకునేలా రూపొందించారు. బరోడా ఎండిజినెక్స్ట్ మొబైల్ యాప్‌లో అనేక కీలక ఫీచర్లు కలిగి ఉన్నాయి. కాగా.. బరోడా ఎండిజినెక్స్ట్ మొబైల్ యాప్ ప్రస్తుతం ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులో ఉంది. అతి త్వరలో ఐఓఎస్(iOS )వినియోగదారులకు కూడా అందుబాటులోకి వచ్చేలా బ్యాంక్‌ ఆఫ్ బరోడా అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు.


యాప్ ఫీచర్లు ఇవే...

  • ఒక్కొక్కటిగా లావాదేవీలను సృష్టించడం

  • బల్క్ అప్‌లోడ్‌లను ఆమోదించడం లేదా తిరస్కరించడం

  • లావాదేవీలు, వర్క్‌ఫ్లోలను ఎండ్ టు ఎండ వరకు ట్రాక్ చేస్తుంది

  • లావాదేవీల స్థితిపై రియల్ టైమ్‌లో విచారిస్తుంది ఈ యాప్

  • బ్యాంక్ స్టేట్‌మెంట్స్, మినీ స్టేట్‌మెంట్‌లను చూపిస్తుంది

  • అన్ని గ్రూప్ ఎంటీటీల ఏకీకృత డాష్‌బోర్డ్‌ను యాక్సెస్ చేస్తుంది

  • ఓటీపీ వెరిఫికేషన్, 3 ఫ్యాక్టర్ ఆథెంటికేషన్‌తో మెరుగైన భద్రతను ఈ యాప్ అందిస్తుంది


ఇదో మైలు రాయి...

బరోడా ఎండిజినెక్స్ట్ మొబైల్ యాప్ క్యాష్ మేనేజ్‌మెంట్ సేవల్లో ఓ మైలు రాయి అని.. ఇది కార్పొరేట్ కస్టమర్లకు క్యాష్ మేనేజ్‌మెంట్, బ్యాంకింగ్ సేవల్లో సరికొత్త అనుభవాన్ని అందిస్తుందని బ్యాంక్ ఆఫ్ బరోడా మేనేజింగ్ డైరెక్టర్ & సీఈఓ దేబదత్త చంద్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ లలిత్ త్యాగి అన్నారు. ఈ యాప్‌ కార్పేరేట్ కస్టమర్లకు విలువైన సమాచారాన్ని అందిస్తుందని తెలిపారు. ఇది కస్టమర్ల సౌలభ్యం, సామర్థ్యం, నగదు ప్రవాహ నిర్వహణపై మెరుగైన నియంత్రణను అందిస్తుందని వారు పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి

Tirumala: ఆ హోటళ్లకు అనుమతులు రద్దు

CM Revanth Reddy: తక్కువ వడ్డీకి రుణాలివ్వండి!

Read Latest Business News And Telugu News

Updated Date - Mar 22 , 2025 | 01:13 PM