Share News

Gold Rate: స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు

ABN , Publish Date - Mar 28 , 2025 | 07:25 AM

గోల్డ్ ధరలు ప్రపంచ బంగారం ధరలపై ఆధారపడి ఉంటాయి, ద్రవ్యోల్బణం, ప్రపంచ ధరలలో మార్పు, కేంద్ర బ్యాంకు బంగారు నిల్వ, హెచ్చుతగ్గుల వడ్డీ రేట్లు, ఆభరణాల మార్కెట్లు వంటి అనేక అంతర్జాతీయ అంశాల ద్వారా ఇవి ప్రభావితమవుతాయి. ఈ క్రమంలో శుక్రవారం బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి.

Gold Rate: స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు
Gold Rage Today

బిజినెస్ న్యూస్: పసిడి (Gold), వెండికి (Silver) మార్కెట్లో (Market) ఎల్లప్పుడూ డిమాండ్ (Demand) ఉంటుంది. అయితే పసిడి, వెండి ధరలు గత కొంత కాలం నుంచి పరుగులు పెడుతున్న సంగతి తెలిసిందే. గతంలో ఎన్నడూ లేని విధంగా వీటి ధరలు రికార్డు స్థాయికి చేరుకుంటున్నాయి. ఒక్కోసారి మార్కెట్లో ధరలు పెరిగితే మరి కొన్నిసార్లు తగ్గుతూ కనిపిస్తాయి. గత రెండు మూడు రోజుల నుంచి గోల్డ్, వెండి ధరలు స్వల్పంగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో శుక్రవారం బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగింది. గోల్డ్ ధరలు ప్రపంచ బంగారం ధరలపై ఆధారపడి ఉంటాయి, ద్రవ్యోల్బణం, ప్రపంచ ధరలలో మార్పు, కేంద్ర బ్యాంకు బంగారు నిల్వ, హెచ్చుతగ్గుల వడ్డీ రేట్లు, ఆభరణాల మార్కెట్లు వంటి అనేక అంతర్జాతీయ అంశాల ద్వారా ఇవి ప్రభావితమవుతాయి. గత కొన్ని సంవత్సరాలుగా హైదరాబాద్ (Hyderabad) నగరంలో బంగారం ధరలు స్ధిరంగా ఉండటం లేదు. గతేడాదితో పోలిస్తే భారీగానే పెరుగుతూ వస్తోంది.

Also Read..: అమెరికాలో మకార్తీ భూతం మళ్లీనా?


అయితే అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ (Trump) రెండోసారి పగ్గాలు చేపట్టిన తర్వాత పసిడి ధర పెరిగింది. ఆయన తీసుకుంటున్న వరస సంచలన నిర్ణయాలతో అంతర్జాతీయ మార్కెట్లు బెంబేలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మదుపరులంతా గోల్డ్‌ని సురక్షితమైన పెట్టుబడిగా భావిస్తున్నారు. దిగుమతి సుంకాలను ట్రంప్ భారీగా పెంచారు. దీంతో పెట్టుబడుదారులంతా ఒక్కసారిగా పసిడి వైపు మెుగ్గు చూపడంతో గోల్డ్ ధర రోజు రోజుకు పెరుగుతోంది.

తాజాగా హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం గ్రాముకు రూపాయి పెరిగి 10 గ్రాముల ధర రూ. 83,360గా ఉంది. అలాగే 24 క్యారెట్ల బంగారం గ్రాముకు రూపాయి పెరిగి 10 గ్రాముల ధర రూ. 89,850గా ఉంది. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ, విజయవాడలో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.


దేశవ్యాప్తంగా బంగారం (22, 24 క్యారెట్ల) ధరలు ఎలా ఉన్నాయంటే..

కోల్‌కతా- రూ.83,360, రూ.89,850

చెన్నై- రూ.83,360, రూ.89,850

బెంగళూరు- రూ.83,360, రూ.89,850

పుణె- రూ.రూ.83,370, రూ.89,900

అహ్మదాబాద్- రూ.83,410, రూ.89,900

భోపాల్- రూ.83,410, రూ.89,900

కోయంబత్తూర్- రూ.83,360, రూ.89,850

పట్నా- రూ.83,410, రూ.89,900

సూరత్- రూ.83,410, రూ.89,900

పుదుచ్చెరి- రూ.83,360, రూ.89,850


వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

హైదరాబాద్‌లో కేజీ వెండి దర రూ. 1,10,900గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ.1,01,900కు చేరింది. ఆర్థిక రాజధాని ముంబైలో కేజీ రేటు రూ.1,01,900గా ఉంది. ఇక విజయవాడలో కేజీ ధర రూ.1,10,900గా ఉంది, విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ. 1,10,900 వద్ద కొనసాగుతోంది.


ఈ వార్తలు కూడా చదవండి..

పుష్కరాల్లోపే పోలవరం

కక్ష సాధించే వాడినైతే.. కుటుంబమంతా జైల్లోనే!

For More AP News and Telugu News

Updated Date - Mar 28 , 2025 | 07:25 AM