Home » Hyderabad
ఫోన్ ట్యాపింగ్ కేసులో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు, ‘ఆరా’ పోల్ స్ట్రాటజీస్ సంస్థ వ్యవస్థాపకుడు ఆరా మస్తాన్ను శుక్రవారం విచారించారు. ఈ విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం.
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడు ప్రభాకర్ రావు ఇంటికి వెళ్లిపోయారు. కస్టోడియల్ విచారణ ముగియడంతో వైద్య పరీక్షల నిమిత్తం ఆయనను ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య లేఖ రాశారు. రాష్ట్ర ప్రభుత్వం త్వరలో నిర్వహించనున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను బీసీలకు 42శాతం రిజర్వేషన్లతోనే నిర్వహించాలని ఆయన ఆ లేఖలో కోరారు.
హైదరాబాద్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో యువ సాఫ్ట్వేర్ మృతి చెందాడు. అతివేగంగా బైక్ నడపడం వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.
హైదరాబాద్లోని నల్లకుంటలో దారుణ ఘటన జరిగింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను.. భర్త అతికిరాతంగా హత్య చేశాడు.
హైదరాబాద్ నగరంలో వేర్వేరు ఏరియాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఇరువురు దుర్మరణం పాలయ్యారు. కూతురును చూసి తిరిగి వెళ్తుండగా జరిగిన ప్రమాదంలో ఒకరు మృతిచెందగా.. సోదరుడిని ద్విచక్ర వాహనంపై తీసుకొచ్చేందుకు వెళ్తుండగా జరిగిన ప్రమాదంలో మరొకరు దుర్మరణం పాలయ్యారు. వివరాలిలా ఉన్నాయి.
కూకట్పల్లి రైతుబజార్లో కూరగాయల ధలు ఈ విధంగా ఉన్నాయి. మొన్నటివరకు కేజీ బెండకాయలు రూ. 20 నుంచి 40 వరకు అమ్మగా.. ప్రస్తుతం రూ. 55కు విక్రయిస్తున్నారు. అలాగే దొండకాయను రూ. 40కి విక్రయిస్తున్నారు. మొత్తంగా కూరగాయల ధరలు ఎలా ఉన్నాయంటే...
31 అర్ధరాత్రి, నూతన సంవత్సన వేడుకల సందర్భంగా హైదరాబాద్ మహానగరంలో ప్రశాంతంగా జరిగేలా పోలీసులు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. దీనిలో భాగంగా మొత్తం 120 ప్రాంతాల్లో 7 ప్లటూన్ల పోలీసులు గస్తీలు నిర్వహించేలా నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ అన్ని ఏర్పాట్లు చేశారు.
రైల్వే శాఖ కొత్తగా ప్రతిపాదించిన ఛార్జీల పెంపు శుక్రవారం నుంచి అమల్లోకి రానుంది. ప్రతి కిలోమీటర్ కు స్వల్పంగా (1 లేదా 2 పైసల) పెంపు ఉన్నా సబర్బన్ ప్రయాణికులు, సీజనల్ టికెట్ దారులపై భారం పడకుండా చర్యలు తీసుకున్నారు. సాధారణ, ప్రీమియం రైళ్లకు కొత్త ఛార్జీలు వర్తిస్తాయి. రిజర్వేషన్ ఫీజు, సూపర్ ఫాస్ట్ చార్జీలలో ఎలాంటి మార్పు లేదని రైల్వే అధికారులు ప్రకటించారు.
హైదరాబాద్ మహా నగరాన్ని 12 జోన్లు, 60 సర్కిళ్లుగా ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు 150 వార్డులుండగా.. దానిని ప్రస్తుతం 300 వార్డులు ఏర్పాటు చేశారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది. కాగా.. కుత్బుల్లాపూర్ జోన్లో అత్యధికంగా ఏడు సర్కిళ్లను ఏర్పాటు చేశారు.