Gold Silver Rates Today: భయపెడుతున్న బంగారం, వెండి ధరలు.. ఎంతకు చేరాయంటే..
ABN , Publish Date - Mar 15 , 2025 | 06:33 AM
దేశంలో పసిడి ప్రియులకు షాకుల మీద షాకులు వస్తున్నాయి. ఎందుకంటే వీటి ధరలు ఒక్కసారిగా పుంజుకుని, దాదాపు 90 వేల స్థాయికి చేరాయి. అయితే ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

దేశంలో పసిడి ధరలు సామాన్యులకు షాక్ ఇస్తున్నాయి. గత వారంలో 87 వేల స్థాయిలో ఉన్న ఈ రేట్లు, ఇప్పుడు దాదాపు 90 వేల స్థాయికి చేరుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో భయం, రాజకీయ ఉద్రిక్తతలు, ప్రపంచ ఆర్థిక పరిస్థితుల వంటి పలు అంశాలు పసిడి ధరలను ప్రభావితం చేస్తున్నాయి. ప్రధానంగా అమెరికా ఫెడరల్ రిజర్వు వడ్డీ రేట్ల పెంపు, డాలర్ ధరలో మార్పులు, ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న వస్తు ధరల కారణంగా పసిడి రేట్లు పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.
నేటి ధరలు
ఈ నేపథ్యంలో మార్చి 15, 2025న గుడ్ రిటర్న్స్ వెబ్సైట్ ప్రకారం హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల గోల్డ్ ధర 10 గ్రాములకు రూ.89,790కి చేరింది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 82,310 స్థాయికి చేరుకుంది. ఇదే సమయంలో ఢిల్లీలో 24 క్యారెట్ల పసిడి రేటు 10 గ్రాములకు రూ. 89,940కి చేరుకోగా, 22 క్యారెట్ల గోల్డ్ రేటు 10 గ్రాములకు రూ. 82,460కు చేరింది. మరోవైపు వెండి ధరలు దేశంలో కిలోకు రూ. 103,100 స్థాయికి చేరుకున్నాయి.
దేశంలో వివిధ నగరాల్లో బంగారం ధలు ఎలా ఉన్నాయంటే (24, 22 క్యారెట్)
న్యూఢిల్లీలో రూ.89,940, రూ.82,460
ముంబైలో రూ.89,790, రూ.82,310
కోల్‌కతాలో రూ.89,790, రూ.82,310
చెన్నైలో రూ.89,790, రూ.82,310
బెంగళూరులో రూ.89,790, రూ.82,310
అహ్మదాబాద్లో రూ.89,840, రూ.82,360
విశాఖపట్నంలో రూ.89,790, రూ.82,310
జైపూర్లో రూ.89,940, రూ.82,460
బంగారం శుద్ధతను ఎలా కొలుస్తారు
బంగారాన్ని క్యారెట్లలో కొలవడం అనేది బంగారం శుద్ధతను తెలియజేసే పద్ధతి. 24 క్యారెట్ బంగారం అంటే 100% శుద్ధత కలిగిన బంగారం. అయితే, సాధారణంగా వినియోగించే బంగారం 22 క్యారెట్, 18 క్యారెట్ లేదా 14 క్యారెట్ రూపంలో ఉంటుంది.బంగారం ధరలు మార్కెట్లో ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కానీ దీనిలో శుద్ధత ఆధారంగా బంగారం ధరలు ఉంటాయి.
24 క్యారెట్: 100% శుద్ధత కలిగిన బంగారం
22 క్యారెట్: 91.7% శుద్ధత కలిగిన బంగారం
18 క్యారెట్: 75% శుద్ధత కలిగిన బంగారం
14 క్యారెట్: 58.3% శుద్ధత కలిగిన బంగారం
ఇవి కూడా చదవండి:
Recharge Offer: నెలకు రూ. 99కే రీఛార్జ్ ప్లాన్.. జియో, ఎయిర్‌టెల్‌కు గట్టి సవాల్
BSNL Offers: రూ. 200 బడ్జెట్‌లోపు బెస్ట్ రీఛార్జ్ పాన్లు.. ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయంటే..
Read More Business News and Latest Telugu News