Gold and Sliver Prices: పసిడి ప్రియులకు బ్యాడ్ న్యూస్.. ఇక బంగారం కొనగలమా..
ABN , Publish Date - Mar 22 , 2025 | 06:48 AM
అంతర్జాతీయ మార్కెట్లు, ఆర్థిక, భౌగోళిక ఉద్రిక్తతలు, ద్రవ్యోల్బణం వంటివి పసిడి రేటును ప్రభావితం చేస్తుంటాయి. తాజాగా ట్రంప్ తీసుకుంటున్న సంచలన నిర్ణయాలు గోల్డ్ ధరను అమాంతం పెంచేలా చేస్తున్నాయి.

బిజినెస్ న్యూస్: బంగారం ధరలు రోజురోజుకూ చుక్కలు చూపిస్తున్నాయి. పసిడి కొనాలంటేనే ప్రజలు బెంతేలెత్తిపోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇప్పటికే గోల్డ్ రేటు రికార్డు స్థాయికి చేరుకుని పసిడి ప్రియులకు షాక్ ఇచ్చింది. ఇటీవల జీవిత కాల గరిష్ఠానికి చేరిన బంగారం ధర స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. అయినా గతేడాదితో పోలిస్తే ధర భారీగానే పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లు, ఆర్థిక, భౌగోళిక ఉద్రిక్తతలు, ద్రవ్యోల్బణం వంటివి పసిడి రేటును ప్రభావితం చేస్తుంటాయి. తాజాగా ట్రంప్ తీసుకుంటున్న సంచలన నిర్ణయాలు గోల్డ్ ధరను అమాంతం పెంచేలా చేస్తున్నాయి. ట్రంప్ నిర్ణయాలతో అంతర్జాతీయ మార్కెట్లు కుప్పకూలిపోతున్నాయి. ఈ భయంతోనే మధుపర్లంతా సురక్షితమైన పెట్టుబడిగా భావించి పసిడిని కొంటున్నారు. ఈ కారణంగానే దానికి డిమాండ్ అమాంతం పెరిగిపోయి, ధరకు రెక్కలొచ్చాయి.
కాగా, శనివారం (22-03-2025) https://bullions.co.in/ ప్రకారం.. ఉదయం 06:30 గంటల సమయానికి దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.80,557 ఉండగా.. 24 క్యారెట్ల తులం గోల్డ్ రేటు రూ.87,880గా ఉంది. ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.80,694 కాగా.. 24 క్యారెట్ల తులం గోల్డ్ రేటు రూ.88,030గా ఉంది. ఇక హైదరాబాద్, విజయవాడ, విశాఖ నగరాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.80,823కు చేరుకోగా.. 24 క్యారెట్ల తులం పసిడి రేటు రూ.88,170గా ఉంది.
దేశవ్యాప్తంగా బంగారం (22, 24 క్యారెట్ల) ధరలు ఎలా ఉన్నాయంటే..
కోల్‌కతా- రూ.80,593, రూ.87,920
చెన్నై- రూ.80,933, రూ.88,290
బెంగళూరు- రూ.80,758, రూ.88,100
పుణె- రూ.రూ.80,694, రూ.88,030
అహ్మదాబాద్- రూ.80,804, రూ.88,150
భోపాల్- రూ.80,786, రూ.88,130
కోయంబత్తూర్- రూ.80,933, రూ.88,290
పట్నా- రూ.80,648, రూ.87,980
సూరత్- రూ.80,804, రూ.88,150
వెండి ధరలు ఇలా..
ఇక వెండి విషయానికి వస్తే.. దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి రూ.97,720 ఉండగా, ముంబైలో రూ.97,890కు చేరుకుంది. అలాగే హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో కేజీ వెండి ధర రూ.98,050 వద్ద కొనసాగుతోంది.
ఈ వార్తలు కూడా చదవండి:
SEBI : బోగస్ ఫిన్‌ఇన్‌ఫ్లుయెన్సర్లపై సెబీ వేటు
Business Growth : రెండేళ్లలో తెలంగాణలో రూ.1,000 కోట్ల టర్నోవర్