Share News

Gold and Silver Prices: కొండెక్కిన పసిడి ధర.. ప్రస్తుతం రేట్లు ఎలా ఉన్నాయంటే..

ABN , Publish Date - Mar 24 , 2025 | 06:52 AM

అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో కొండెక్కిన గోల్డ్ రేట్లలో నేడు ఎలాంటి మార్పు లేదు. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.80,713 ఉండగా.. 24 క్యారెట్ల తులం గోల్డ్ రేటు రూ.88,050 వద్ద కొనసాగుతోంది.

Gold and Silver Prices: కొండెక్కిన పసిడి ధర.. ప్రస్తుతం రేట్లు ఎలా ఉన్నాయంటే..
Gold and Silver Prices

బిజినెస్ న్యూస్: ఇటీవల జీవిత కాల గరిష్ఠానికి(తులం రూ.90 వేలు) చేరిన బంగారం ధర స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. కొన్ని రోజులుగా వరసగా చుక్కలు చూపిస్తున్న పసిడి ధర ఇవాళ (24-03-2025)న స్వల్ప తేడాలతో యథావిధిగా కొనసాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో కొండెక్కిన గోల్డ్ రేట్లలో నేడు ఎలాంటి మార్పు లేదు. సోమవారం ఉదయం 06:30 గంటల సమయానికి https://bullions.co.in/ ప్రకారం దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.80,566 ఉండగా.. 24 క్యారెట్ల తులం పసిడి రేటు రూ.87,890 వద్ద కొనసాగుతోంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.80,713 ఉండగా.. 24 క్యారెట్ల తులం గోల్డ్ రేటు రూ.88,050 వద్ద కొనసాగుతోంది. అలాగే హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.80,841 ఉండగా.. 24 క్యారెట్ల తులం పసిడి రేటు రూ.88,190 వద్ద కొనసాగుతోంది. అయితే మరికొన్ని రోజుల్లో బంగారం ధర రూ.లక్ష దాటే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని మార్కెట్ పండితులు చెబుతున్నారు.


దేశవ్యాప్తంగా బంగారం (22, 24 క్యారెట్ల) ధర పరిస్థితి ఎలా ఉందంటే..

  • కోల్‌కతా- రూ.80,603, రూ.87,930

  • చెన్నై- రూ.80,942, రూ.88,300

  • బెంగళూరు- రూ.80,777, రూ.88,120

  • పుణె- రూ.రూ.80,713, రూ.88,050

  • అహ్మదాబాద్- రూ.80,813, రూ.88,160

  • భువనేశ్వర్- రూ.80,731, రూ.88,070

  • భోపాల్- రూ.80,795, రూ.88,140

  • కోయంబత్తూర్- రూ.80,942, రూ.88,300

  • పట్నా- రూ.80,667, రూ.88,000

  • సూరత్- రూ.80,813, రూ.88,160


వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

ఇక వెండి ధరల్లోనూ స్వల్ప తేడాలు కనిపిస్తున్నాయి. ఢిల్లీలో కిలో వెండి ధర ఆదివారం రూ.97,730 ఉండగా.. నేడు రూ.97,740కు చేరింది. ముంబైలో నిన్న కేజీ వెండి రూ.97,900 కాగా.. నేడు రూ.97,910 వద్ద కొనసాగుతోంది. అలాగే తెలుగు నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి ధర ఆదివారం రూ.98,050 ఉండగా.. నేడు రూ.98,060కి చేరుకుంది.


ఈ వార్తలు కూడా చదవండి:

టెక్‌ వ్యూ : కన్సాలిడేషన్‌కు ఆస్కారం

ఫార్మా కింగ్‌ దివీస్‌ మురళి

Updated Date - Mar 24 , 2025 | 06:59 AM