Share News

Gold and Silver Prices: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధర..

ABN , Publish Date - Mar 25 , 2025 | 06:41 AM

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్. బంగారం ధర భారీగా పడిపోయింది. కొన్ని రోజులుగా వరసగా పెరుగుతూ వస్తున్న రేటు మంగళవారం ఒక్కసారిగా తగ్గుముఖం పట్టింది.

Gold and Silver Prices: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధర..
Gold and Silver Prices

బిజినెస్ న్యూస్: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్. బంగారం ధర భారీగా పడిపోయింది. కొన్ని రోజులుగా వరసగా పెరుగుతూ వస్తున్న రేటు నేడు (25-03-2025) భారీగా తగ్గుముఖం పట్టింది. మంగళవారం ఉదయం 06:30 గంటల సమయానికి https://bullions.co.in/ ప్రకారం దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.80,566 ఉండగా.. ఇవాళ రూ.80,117కు తగ్గింది. 24 క్యారెట్ల తులం పసిడి రేటు నిన్న రూ.87,890 కాగా.. ఈరోజు రూ.87,400కు పడిపోయింది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర సోమవారం రూ.80,713 ఉండగా.. నేడు రూ.80,254కు తగ్గుముఖం పట్టింది. అలాగే 24 క్యారెట్ల తులం గోల్డ్ రేటు నిన్న రూ.88,050 కాగా.. ఇవాళ రూ.87,550కు పడిపోయింది. ఇక హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర సోమవారం రూ.80,841 కాగా.. నేడు రూ.80,383కు తగ్గింది. 24 క్యారెట్ల తులం పసిడి రేటు నిన్న రూ.88,190 ఉండగా.. ఈరోజు రూ.87,690కు పడిపోయింది.


దేశవ్యాప్తంగా బంగారం (22, 24 క్యారెట్ల) ధర పరిస్థితి ఎలా ఉందంటే..

  • కోల్‌కతా- రూ.80,144, రూ.87,430

  • చెన్నై- రూ.80,483, రూ.87,800

  • బెంగళూరు- రూ.80,318, రూ.87,620

  • పుణె- రూ.80,254, రూ.87,550

  • అహ్మదాబాద్- రూ.80,355, రూ.87,660

  • భువనేశ్వర్- రూ.80,273, రూ.87,570

  • భోపాల్- రూ.80,337, రూ.87,640

  • కోయంబత్తూర్- రూ.80,483, రూ.87,800

  • పట్నా- రూ.80,208, రూ.87,500

  • సూరత్- రూ.80,355, రూ.87,660


వెండి ధరల పరిస్థితి ఇది..

దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం కిలో వెండి రూ.97,740 ఉండగా.. మంగళవారం రూ.97,470కు తగ్గింది. ముంబైలో నిన్న కేజీ వెండి రూ.97,910 కాగా.. ఇవాళ రూ.97,640కు చేరింది. ఇక హైదరాబాద్, విజయవాడ, విశాఖలో కిలో వెండి సోమవారం రూ.98,060 ఉండగా.. నేడు రూ.97,790కు పడిపోయింది.


ఈ వార్తలు కూడా చదవండి:

బుల్‌ మార్చ్‌

ఎఫ్‌పీఐలకు సెబీ ఊరట

Updated Date - Mar 25 , 2025 | 06:55 AM