Gold and Silver Prices: పసిడి ప్రియులకు షాక్..
ABN , Publish Date - Mar 21 , 2025 | 07:25 AM
బంగారం ధరలు శుక్రవారం స్వల్పంగా పెరిగాయి. తాజాగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న చర్యల వల్ల బంగారానికి ధర రోజు రోజుకు పెరుగుతోంది. దిగుమతి సుంకాలను ట్రంప్ భారీగా పెంచారు.దీంతో పెట్టుబడుదారులంతా ఒక్కసారిగా పసిడి వైపు మెుగ్గు చూపడంతో గోల్డ్ ధర రోజు రోజుకు పెరుగుతోంది.

బిజినెస్ న్యూస్: బంగారం ధర (Gold Rate) శుక్రవారం స్వల్పంగా పెరిగింది (Hike). గోల్డ్ ధరలు ప్రపంచ బంగారం ధరలపై ఆధారపడి ఉంటాయి, ద్రవ్యోల్బణం, ప్రపంచ ధరలలో మార్పు, కేంద్ర బ్యాంకు బంగారు నిల్వ, హెచ్చుతగ్గుల వడ్డీ రేట్లు, ఆభరణాల మార్కెట్లు వంటి అనేక అంతర్జాతీయ అంశాల ద్వారా ఇవి ప్రభావితమవుతాయి. గత కొన్ని సంవత్సరాలుగా హైదరాబాద్ (Hyderabad) నగరంలో బంగారం ధరలు స్ధిరంగా ఉండటం లేదు. గతేడాదితో పోలిస్తే భారీగానే పెరుగుతూ వస్తోంది. అయితే అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ (Trump) రెండోసారి పగ్గాలు చేపట్టిన తర్వాత పసిడి ధర పెరిగింది. ఆయన తీసుకుంటున్న వరస సంచలన నిర్ణయాలతో అంతర్జాతీయ మార్కెట్లు బెంబేలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మదుపరులంతా గోల్డ్‌ని సురక్షితమైన పెట్టుబడిగా భావిస్తున్నారు. దిగుమతి సుంకాలను ట్రంప్ భారీగా పెంచారు. దీంతో పెట్టుబడుదారులంతా ఒక్కసారిగా పసిడి వైపు మెుగ్గు చూపడంతో గోల్డ్ ధర రోజు రోజుకు పెరుగుతోంది.
Also Read..:
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం గ్రాముకు రూపాయి పెరిగి 10 గ్రాముల ధర రూ. 83,110గా ఉంది. అలాగే 24 క్యారెట్ల బంగారం గ్రాముకు రూపాయి పెరిగి 10 గ్రాముల ధర రూ. 90,670గా ఉంది.
దేశవ్యాప్తంగా బంగారం (22, 24 క్యారెట్ల) ధరలు ఎలా ఉన్నాయంటే..
కోల్‌కతా- రూ.83,110, రూ.90,670
చెన్నై- రూ.83,110, రూ.90,670
బెంగళూరు- రూ.83,110, రూ.90,670
పుణె- రూ.రూ.83,110, రూ.90,720
అహ్మదాబాద్- రూ.83,160, రూ.90,720
భోపాల్- రూ.83,160, రూ.90,720
కోయంబత్తూర్- రూ.83,110, రూ.90,670
పట్నా- రూ.83,160, రూ.90,720
సూరత్- రూ.83,160, రూ.90,720
పుదుచ్చెరి- రూ.83,110, రూ.90,670
వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
హైదరాబాద్‌లో కేజీ వెండి దర రూ. 1,14,200గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ.1,05,200కు చేరింది. ఆర్థిక రాజధాని ముంబైలో కేజీ రేటు రూ.1,05,200గా ఉంది. ఇక విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో కిలో వెండి ధర రూ. 1,14,200 వద్ద కొనసాగుతోంది.
ఈ వార్తలు కూడా చదవండి..
వడ్డీ చెల్లింపులకే 14.2% సొమ్ము హరీ
For More AP News and Telugu News