Gold Rates Today: బంగారం కొనాలా.. నేటి ధరలు ఎలా ఉన్నాయంటే..
ABN , Publish Date - Mar 09 , 2025 | 07:18 AM
నేటి బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వచ్చే వారం కూడా ధరల్లో స్వల్ప మార్పులే ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: భారతీయులకు బంగారంపై మక్కువ ఎక్కువ. పెట్టుబడుల కోసమే కాకుండా శుభకార్యాలు, పండుగలు, ఇతర పర్వదినాల్లో కూడా బంగారం కొనుగోళ్లపై మక్కువ చూపుతుంటారు. ఇలాంటి వారికి నిత్యం బంగార ధరలపై దృష్టి పెట్టాలి. హెచ్చుతగ్గులపై స్పష్టమైన అంచనాలతో బంగారంపై పెట్టుబడి పెడితే మంచి లాభాలు కళ్ల చూడొచ్చు. ప్రస్తుతం భారత్‌లో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 87710గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.80400గా ఉంది. ఇక కిలో వెండి ధర రూ.99,100కు చేరింది (Gold Rates today).
Read: EPFO: కొత్త అప్డేట్ .. EDLI స్కీం ద్వారా మరిన్ని ప్రయోజనాలు
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు (24కే, 22కే) ఇవే..
న్యూఢిల్లీ: రూ.87,860; రూ.8,055
ముంబై: రూ.8,771; రూ.8,040
కోల్‌కతా: రూ.8,771; రూ.8,040
చెన్నై: రూ.86,220; రూ.79,035
బెంగళూరు: రూ.86,040 ; రూ.78,870
హైదరాబాద్: 86,110; రూ.78,934
అహ్మదాబాద్: రూ.86,090; రూ.78,916
పూణె: రూ.85,970; రూ.78,806;
Read: డెడ్‌లైన్స్ దగ్గర పడుతున్నాయ్..
వచ్చే వారం బంగారం ధరల్లో స్వల్ప హెచ్చుతగ్గులు మినహా పెద్దగా మార్పులు ఉండకపోవచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక వెండి ధరలు స్థిరంగా కొనసాగవచ్చన్న అంచనాలు ఉన్నాయి. దేశంలోని వివిధ నగరాల మధ్య బంగారం వెండి, ధరల్లో కూడా స్వల్ప వ్యత్యాసాలు ఉంటాయి. స్థానికంగా డిమాండ్, రవాణా ఖర్చులు, స్థానిక డ్యూటీలు, ఇతర సుంకాలు, నగల తయారీ ఖర్చులు వంటివన్నీ వివిధ నగరాల మధ్య ధరల్లో వ్యత్యాసానికి కారణంగా అవుతాయి.