‘ఐసీఐసీఐ’ సేవింగ్ డిపాజిట్ రేటు 0.25% తగ్గింపు
ABN , Publish Date - Apr 17 , 2025 | 03:39 AM
ఐసీఐసీఐ బ్యాంక్ సైతం పొదుపు ఖాతా డిపాజిట్లపై చెల్లించే వడ్డీరేటును 0.25 శాతం తగ్గించింది. కొత్త రేటు బుధవారం నుంచే...
ముంబై: ఐసీఐసీఐ బ్యాంక్ సైతం పొదుపు ఖాతా డిపాజిట్లపై చెల్లించే వడ్డీరేటును 0.25 శాతం తగ్గించింది. కొత్త రేటు బుధవారం నుంచే అమలులోకి వస్తుందని బ్యాంక్ స్పష్టం చేసింది. దీంతో రూ.50 లక్షల లోపు సేవింగ్ డిపాజిట్లపై వార్షిక వడ్డీ 2.75 శాతానికి తగ్గింది. రూ.50 లక్షలకు పైగా డిపాజిట్‌పై వడ్డీ 3.25 శాతానికి దిగివచ్చింది. ఈ నెల 9న ఆర్‌బీఐ రెపో రేటు తగ్గించడంతో బ్యాంక్‌లు ఒక్కొక్కటిగా డిపాజిట్లపై వడ్డీరేట్లు తగ్గిస్తున్నాయి.
Read More Business News and Latest Telugu News