తెలుగు రాష్ట్రాల్లో 20 కొత్త శాఖలు
ABN , Publish Date - Mar 27 , 2025 | 04:13 AM
ప్రముఖ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ ఐఐఎ్‌ఫఎల్ హోమ్ ఫైనాన్స్ తెలుగు రాష్ట్రాల్లో తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తోంది. ఇందులో భాగంగా వచ్చే ఆర్థిక సంవత్సరం (2025-26) తెలంగాణలో...

2025-26లో రూ.4,000 కోట్ల రుణాలు
ఐఐఎ్‌ఫఎల్ హోమ్ ఫైనాన్స్
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): ప్రముఖ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ ఐఐఎ్‌ఫఎల్ హోమ్ ఫైనాన్స్ తెలుగు రాష్ట్రాల్లో తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తోంది. ఇందులో భాగంగా వచ్చే ఆర్థిక సంవత్సరం (2025-26) తెలంగాణలో 10, ఆంధ్ర ప్రదేశ్‌లో 10 కొత్త శాఖలు ఏర్పాటు చేయనుంది. ఈ శాఖలన్నీ రెండు రాష్ట్రాల్లోని ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లోనే ఏర్పాటు చేస్తామని కంపెనీ జోనల్ సేల్స్ హెడ్ రేకపల్లి శ్రీనివాస్ చెప్పారు. కంపెనీకి ఇప్పటికే తెలంగాణలో 42, ఆంధ్ర ప్రదేశ్‌లో 50 శాఖలున్నాయి. వర్తమాన ఆర్థిక సంవత్సరం రెండు రాష్ట్రాల్లోని శాఖల ద్వారా స్థిరాస్తి రంగానికి గృహ, మార్జిగేజ్, ప్రాజెక్టు రుణాల రూపంలో రూ.2,400 కోట్లు మంజూరు చేసింది. వచ్చే ఆర్థిక సంవత్సరం ఈ మొత్తాన్ని రూ.4,000 కోట్లకు పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు శ్రీనివాస్ చెప్పారు.
రుణ దరఖాస్తులను పూర్తిగా డిజిటల్ పద్దతిలో ప్రాసెస్ చేసి అర్హులైన వారికి అర గంటలోనే సూత్రప్రాయ ఆమోదం తెలపడం తమ సంస్థ ప్రత్యేకత అన్నారు. రుణాల విడుదల కూడా వారం రోజుల్లోనే పూర్తవుతుందన్నారు. దరఖాస్తుదారుల పరపతి స్కోరును బట్టి తమ రుణాలపై 8.25-13 శాతం వడ్డీరేటు ఉంటుందని శ్రీనివాస్ చెప్పారు.
ఇవి కూడా చదవండి:
Hotel Booking: ఒయో రూమ్స్ కోసం ఆధార్ ఉపయోగిస్తున్నారా.. అయితే ఇలా చేయండి
Single Recharge: ఒకే రీఛార్జ్‌తో ముగ్గురికి ఉపయోగం..సరికొత్త ప్లాన్ ప్రవేశపెట్టిన బీఎస్‌ఎన్‌ఎల్
NASSCOM: వచ్చే రెండేళ్లలో లక్ష మంది విద్యార్థులకు ఉచితంగా ఏఐ శిక్షణ
Read More Business News and Latest Telugu News