Share News

జాయ్‌ అలూక్కా్‌సకు గౌరవ డాక్టరేట్‌

ABN , Publish Date - Mar 28 , 2025 | 03:07 AM

జువెలరీ రిటైల్‌ సంస్థ జోయాలుక్కాస్‌ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ జాయ్‌ అలుక్కా్‌సకు చిత్కార యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేసిం ది. భారత్‌ సహా అంతర్జాతీయంగా...

జాయ్‌ అలూక్కా్‌సకు గౌరవ డాక్టరేట్‌

చెన్నై (ఆంధ్రజ్యోతి): జువెలరీ రిటైల్‌ సంస్థ జోయాలుక్కాస్‌ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ జాయ్‌ అలుక్కా్‌సకు చిత్కార యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేసిం ది. భారత్‌ సహా అంతర్జాతీయంగా ఆభరణాల వ్యాపారా న్ని కొత్త పుంతలు తొక్కించటంతో పాటు దాతృత్వ కార్యకలాపాలకు జాయ్‌ అలుక్కాస్‌ అందించిన తోడ్పాటుకు గుర్తింపుగా చిత్కార విశ్వవిద్యాలయం డాక్టర్‌ ఆఫ్‌ లిటరేచర్‌ (హానోరిస్‌ కాసా) అందజేసింది. చిత్కార యూనివర్సిటీ చాన్స్‌లర్‌ డాక్టర్‌ అశోక్‌ కే చిత్కార, ప్రొ-చాన్స్‌లర్‌ డాక్టర్‌ మధు చిత్కార, వైస్‌ చాన్స్‌లర్‌ డాక్టర్‌ సందీప్‌ శర్మ.. అలుక్కా్‌సకు గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేశారు. పారిశ్రామిక రంగంతో పాటు భవిష్యత్‌ తరాల కోసం వినూత్నంగా ఆలోచించిన వ్యక్తి జాయ్‌ అలుక్కాస్‌ అని ఈ సందర్భంగా ప్రొ-చాన్స్‌లర్‌ మధు చిత్కార అన్నారు.

Updated Date - Mar 28 , 2025 | 03:07 AM