Share News

మణిపాల్‌ సిగ్నాలో ఎల్‌ఐసీకి 49% వాటా!

ABN , Publish Date - Mar 28 , 2025 | 03:06 AM

ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (ఎల్‌ఐసీ).. ఆరోగ్య బీమా రంగంలోకి అడుగుపెట్టే దిశగా చురుగ్గా పావులు కదుపుతోంది. ఈ ప్రయత్నాల్లో భాగంగా రంజన్‌ పాయ్‌ సారథ్యంలోని మణిపాల్‌ సిగ్నాలో...

మణిపాల్‌ సిగ్నాలో ఎల్‌ఐసీకి 49% వాటా!

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (ఎల్‌ఐసీ).. ఆరోగ్య బీమా రంగంలోకి అడుగుపెట్టే దిశగా చురుగ్గా పావులు కదుపుతోంది. ఈ ప్రయత్నాల్లో భాగంగా రంజన్‌ పాయ్‌ సారథ్యంలోని మణిపాల్‌ సిగ్నాలో 40-49 శాతం వాటాలు కొనుగోలు చేసేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విధివిధానాలు ఖరారు చేస్తున్నట్టు ఈ వ్యవహారంతో సంబంధమున్న వర్గాలంటున్నా యి. ఈ కొనుగోలు విలువ రూ.3,500-3,750 కోట్ల వరకు ఉండొచ్చని అంచనా. ఈ ప్రయత్నం కార్యరూపం దాల్చినట్టయితే సుమారుగా రూ.3 లక్షల కోట్ల విలువ గల సాధారణ బీమా వ్యాపారంలో 37 శాతం వాటా కలిగిన ఎల్‌ఐసీకి ఆరోగ్య బీమా రంగంలోకి అడుగు పెట్టే మార్గం సుగమం అవుతుంది. ఇది పాయ్‌ సారథ్యంలోని మణిపాల్‌ గ్రూప్‌, అమెరికాకు చెందిన సిగ్నా కార్పొరేషన్‌, ఎల్‌ఐసీ మధ్య త్రికోణ డీల్‌ కావచ్చని అంటున్నారు. ఎల్‌ఐసీకి గల బలమైన నెట్‌వర్క్‌తో మార్కెట్‌ గతిని ఈ డీల్‌ ప్రభావితం చేయవచ్చన్నది పరిశీలకుల అభిప్రాయం.

ఇవి కూడా చదవండి:

Stock Market Update: లాభాల్లో ట్రేడవుతున్న స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

SEBI: ఆప్షన్ ట్రేడింగ్ అక్కడే కొంప ముంచుతోంది : సెబీ ఛైర్మన్

454 చెట్లను నరికించిన వ్యక్తికి 4.54 కోట్ల ఫైన్‌

భారత్‌ను స్ఫూర్తిగా తీసుకుందాం

Updated Date - Mar 28 , 2025 | 03:06 AM