Share News

మార్కెట్లోకి నియో ఆహార్‌ ఉత్పత్తులు

ABN , Publish Date - Apr 21 , 2025 | 02:18 AM

హైదరాబాద్‌ కేంద్రంగా ఉన్న టియోనాట్‌ నియోకేర్‌ మార్కెట్లోకి నియో ఆహార్‌ పేరుతో మార్కెట్లోకి సరికొత్త పోషకాహార ఉత్పత్తులను తీసుకువచ్చింది. ఈ ఉత్పత్తులను సినీ నటుడు తనికెళ్ల భరణి విడుదల...

మార్కెట్లోకి నియో ఆహార్‌ ఉత్పత్తులు

హైదరాబాద్‌ కేంద్రంగా ఉన్న టియోనాట్‌ నియోకేర్‌ మార్కెట్లోకి నియో ఆహార్‌ పేరుతో మార్కెట్లోకి సరికొత్త పోషకాహార ఉత్పత్తులను తీసుకువచ్చింది. ఈ ఉత్పత్తులను సినీ నటుడు తనికెళ్ల భరణి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రుచికి పోషక విలువలను జత చేయటంతో పాటు ఈ తరానికి తగ్గట్టుగా ఐదు నిమిషాల్లోనే ఆహారాన్ని సిద్ధం చేయటం నియో ఆహార్‌ ఉత్పత్తుల ప్రత్యేకత అని అన్నారు. సాంప్రదాయ రుచులతో పాటు ఆరోగ్యకరమైన పోషక విలువలను నియో ఆహార్‌ ఉత్పత్తులు కలిగి ఉంటాయని టియోనాట్‌ నియోకేర్‌ ఎండీ సత్య ప్రసాద్‌ తెలిపారు. ఫోర్టిఫైడ్‌ దాల్‌ మిక్స్‌, ఫోర్టిఫైడ్‌ వడ మిక్స్‌, ఫోర్టిఫైడ్‌ చోలే మిక్స్‌ వంటి పలు రకాలైన ఉత్పత్తులు నియో ఆహార్‌ ద్వారా అందుబాటులో ఉంటాయని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో సినీ దర్శకుడు వీఎన్‌ ఆదిత్య, మాజీ ఆర్‌టీఐ కమిషనర్‌ పి విజయ్‌ బాబు, మోడ్రన్‌ ఫుడ్‌ ఇండస్ట్రీస్‌ మాజీ సీఎండీ ఎంఎం కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Read More Business News and Latest Telugu News

Updated Date - Apr 21 , 2025 | 02:18 AM