Stock Market Update: లాభాల్లో ట్రేడవుతున్న స్టాక్ మార్కెట్ సూచీలు
ABN , Publish Date - Mar 27 , 2025 | 11:13 AM
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మొదట నష్టాల్లో ప్రారంభమైనా ఆ తర్వాత లాభాల దిశగా పయనించి మళ్లీ ఒడిదుడుకులు మధ్య ఊగిసలాడుతున్నాయి.

Stock Market : దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు స్వల్ప లాభాల మధ్య కదలాడుతున్నాయి. ఉదయం నష్టాల్లో ప్రారంభమైన మార్కెట్లు వెంటనే కోలుకొని లాభాల దిశగా పరుగులు తీశాయి. అయితే, పదిన్నర సమయంలో కొంతమేర ఒడిదుడుకులు ఎదుర్కొంటూ ముందుకు సాగుతోంది. దాదాపు అంతర్జాతీయ మార్కెట్లన్నీ నష్టాలు నమోదు చేయగా మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తుండటమే దీనికి కారణం కావొచ్చు. అయితే, ప్రధాన షేర్లలో కొనుగోళ్ల మద్దతు లాభాల బాటలో ముందుకు సాగేందుకు దోహదం చేస్తున్నాయి. ఉదయం 11:00 గంటల సమయంలో సెన్సెక్స్ (Sensex) 392 పాయింట్లు లాభంతో 77,680 వద్ద ట్రేడవుతుండగా.. నిఫ్టీ (Nifty) 112 పాయింట్ల లాభంతో 23,600 వద్ద ఉన్నాయి.
అమెరికా మార్కెట్లు నిన్న నష్టాల్లో ముగిశాయి. ఎస్‌అండ్‌పీ సూచీ 1.12 శాతం, నాస్‌డాక్ 2.04 శాతం నష్టపోయాయి. డౌజోన్స్ ఫ్లాట్‌గా ముగిసింది. ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. జపాన్ నిక్కీ 1.00 శాతం నష్టంతో 375 పాయింట్ల దగ్గర ట్రేడవుతుంటే.. హాంకాంగ్ హాంగెసెంగ్ 0.93 శాతం లాభంతో ముందుకు సాగుతోంది. విదేశీ సంస్థాగత మదుపర్లు (FIIs) నిన్న రూ.2,241 కోట్ల విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. దేశీయ సంస్థాగత మదుపర్లు (DIIs) నికరంగా రూ.696 కోట్ల మేర షేర్ల అమ్మకాలు జరిపారు.
ఇవి కూడా చదవండి:
బ్యాంకు ఖాతాలకు ఇక నలుగురు నామినీలు