Home » Stock Market
ఈ వారం మదుపర్లకు పీడకలను మిగిల్చింది. గత రెండేళ్లలో చూసుకుంటే అత్యంత భారీ నష్టాలను కలిగించిన వారం ఇదే. బీఎస్ఈ నమోదిత కంపెనీల విలువ ఈ వారంలో రూ.19 లక్షల కోట్లు ఆవిరైంది. సెన్సెక్స్, నిఫ్టీ 4 శాతం చొప్పున పడిపోయాయి.
స్టాక్‌మార్కెట్ వ్యాపారానికి సలహాలిస్తామంటూ అనుమతి లేని వ్యాపారానికి తెరతీసిన యూట్యూబర్ రవీంద్ర బాలు భారతిపై సెబీ కొరడా ఝళపించింది. చట్టవ్యతిరేక కార్యకలాపాల ద్వారా దండుకున్న రూ.9.5 కోట్లు తిరిగిచ్చేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది.
భారత స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ నష్టాల్లో ఉన్నాయి. ఈ క్రమంలో ప్రధాన సూచీలు మొత్తం నష్టాల వైపే మొగ్గుచూపుతున్నాయి. ఈ క్రమంలో సూచీలు ఏ మేరకు నష్టపోయాయనే వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.
2024లో భారత స్టాక్ మార్కెట్ అనేక పరిణామాలను ఎదుర్కొంది. ప్రతికూల, సానుకూల పరిణామాలతో అంచనాలను అధిగమించింది. ఈ క్రమంలో సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు హెచ్చుతగ్గులకు లోనయ్యాయి. ఈ ఏడాది కాలంలో పలు రంగాలు అద్భుతంగా వృద్ధి చెందగా, మరికొన్ని మాత్రం తగ్గుముఖం పట్టాయి. ఈ క్రమంలో 2024లో ఎలాంటి సంఘటనలు స్టాక్ మార్కెట్‌ను ప్రభావితం చేశాయనే వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.
నిఫ్టీ మూడు రోజుల్లో ఏకంగా 600 పాయింట్లు దిగజారింది. మంగళవారం వెయ్యి పాయింట్లకు పైగా కోల్పోయిన సెన్సెక్స్ బుధవారం మరో ఐదు వందల పాయింట్లు కోల్పోయింది. ఒక్క ఐటీ మినహా మిగతా రంగాలు నష్టాలను మూటగట్టుకున్నాయి. ఈ రోజు అమెరికా ఫెడరల్ బ్యాంక్ వడ్డీ రేట్ల నిర్ణయాలు వెలువడనున్నాయి
అమెరికా ఫెడరల్ బ్యాంక్ వడ్డీ రేట్లను ప్రకటించనున్న నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. బ్యాంకింగ్, ఆటో, ఐటీ, మెటల్స్ రంగంలో అమ్మకాలు వెల్లువెత్తడంతో దేశీయ సూచీలు భారీ నష్టాలను చవిచూశాయి.
మెటల్స్, మైనింగ్ రంగంలో ప్రముఖ కంపెనీ వేదాంత లిమిటెడ్ తన పెట్టుబడిదారులకు గుడ్ న్యూస్ తెలిపింది. సోమవారం జరిగిన సమావేశంలో ఈ ఆర్థిక సంవత్సరానికి నాలుగో మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించారు. అయితే ఎంత ప్రకటించారు. మొత్తం ఎంత అనే వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.
మార్కెట్లకు ఉత్సాహం కలిగించే వార్తలు కూడా లేకపోవడంతో స్టాక్ మార్కెట్లు డల్‌గా ప్రారంభమయ్యాయి. బ్యాంకింగ్, స్మాల్ క్యాప్ స్టాక్స్ మాత్రం రాణిస్తున్నాయి. సోమవారం ఉదయం సెన్సెక్స్ 130 పాయింట్ల నష్టంతోనూ, 13 పాయింట్ల నష్టంతోనూ ప్రారంభమయ్యాయి.
ఐపీఓల వీక్ మళ్లీ వచ్చేసింది. వచ్చే వారం అంటే డిసెంబర్ 16 నుంచి 6 కొత్త ఐపీఓలు మొదలుకానున్నాయి. దీంతో ప్రాథమిక మార్కెట్లో కార్యకలాపాలు మరింత పెరగనున్నాయి. ఈ క్రమంలో ఆ కంపెనీల విశేషాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
భారత స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీ లాభాలతో ముగిశాయి. నష్టాలతో ప్రారంభమైన మార్కెట్లు, చివరకు భారీ లాభాల దిశగా దూసుకెళ్లాయి. ఈ క్రమంలో సెన్సెక్స్, నిఫ్టీ ఏ మేరకు పుంజుకుందనే వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.