టెక్ వ్యూ : 24,000 స్థాయిలో పరీక్ష
ABN , Publish Date - Apr 21 , 2025 | 02:25 AM
నిఫ్టీ గత వారం ప్రధాన నిరోధం 23,000ని బ్రేక్ చేసుకుంటూ బలమైన ర్యాలీలో పురోగమించి చివరికి 23,850 వద్ద వారం గరిష్ఠ స్థాయిలో బలంగా క్లోజయింది. వారం మొత్తంలో 1,000 పాయింట్లకు పైగా లాభపడింది...
నిఫ్టీ గత వారం ప్రధాన నిరోధం 23,000ని బ్రేక్ చేసుకుంటూ బలమైన ర్యాలీలో పురోగమించి చివరికి 23,850 వద్ద వారం గరిష్ఠ స్థాయిలో బలంగా క్లోజయింది. వారం మొత్తంలో 1,000 పాయింట్లకు పైగా లాభపడింది. గత ఏడు రోజుల కాలంలో సుమారు 2,000 పాయింట్ల మేరకు రికార్డు లాభం నమోదు చేసింది. ఈ వారంలో కూడా మార్కెట్ సానుకూలంగానే ప్రారంభం కావచ్చు. ఈ క్రమంలో కీలక మానసిక అవధి 24,000 వద్ద పరీక్ష ఎదుర్కొనే ఆస్కారం ఉంది. గత వారంలో మిడ్‌క్యాప్ సూచీ 2,150 పాయింట్లు, స్మాల్‌క్యాప్ సూచీ 415 పాయింట్లు లాభపడ్డాయి.
బుల్లిష్ స్థాయిలు: నిఫ్టీ 24,000 పాయింట్ల కీలక స్థాయిలో మూడోసారి పరీక్ష ఎదుర్కొనబోతోంది. గత కొద్ది రోజుల్లో నిట్టనిలువుగా లాభపడినందు వల్ల తదుపరి దిశ తీసుకునే ముందు తొలుత కన్సాలిడేట్ కావచ్చు. మరింత స్వల్పకాలిక సానుకూల సంకేతం కోసం ఇక్కడ నిలదొక్కుకుని తీరాలి.
బేరిష్ స్థాయిలు: ప్రస్తుత కీలక స్థాయి 23,800 వద్ద నిలదొక్కుకోవడంలో విఫలమైతే స్వల్పకాలిక బలహీనత కనబరుస్తుంది. ప్రధాన మద్దతు స్థాయి 23,500. ఇక్కడ కూడా విఫలమైతే స్వల్పకాలిక బలహీనత తప్పదు.
బ్యాంక్ నిఫ్టీ: ఈ సూచీ గత వారం రికార్డు స్థాయిలు 3,300 పాయింట్లు లాభపడి 54,300 వద్ద ముగిసింది. గత ఏడాది సెప్టెంబరు 26వ తేదీన నమోదైన జీవితకాల గరిష్ఠ స్థాయి 54,460కి సమీపంలో ఉంది. ప్రధాన నిరోధం 54,600. ఇక్కడ కన్సాలిడేషన్‌తో పాటు పుల్‌బ్యాక్ రియాక్షన్ కూడా ఏర్పడవచ్చు. ఏదైనా బలహీనత ఏర్పడినా సానుకూలత కోసం 54,000 కన్నా పైన నిలదొక్కుకుని తీరాలి.
పాటర్న్: మార్కెట్ 24,000 స్థాయిలో ఉన్న 200 డిఎంఏకి చేరువవుతోంది. ఇక్కడ కన్సాలిడేట్ కావచ్చు. మరింత సానుకూలత కోసం ఇదే స్థాయిలో ‘‘అడ్డంగా ఏర్పడిన రెసిస్టెన్స్ ట్రెండ్‌లైన్’’ కన్నా పైన నిలదొక్కుకోవాలి.
టైమ్: ఈ సూచీ ప్రకారం మంగళవారం తదుపరి రివర్సల్ ఉంది.
సోమవారం స్థాయిలు
నిరోధం : 24,000, 24,080
మద్దతు : 23,940, 23,850
వి. సుందర్ రాజా
Read More Business News and Latest Telugu News