Share News

టెక్‌ వ్యూ : 24000 కీలకం

ABN , Publish Date - Apr 28 , 2025 | 02:15 AM

నిఫ్టీ ఎట్టకేలకు గత వారం కీలక స్థాయి 24000 కన్నా స్వల్పంగా ఎగువన ముగిసింది. ప్రారంభంలో పాజిటివ్‌ ట్రెండ్‌లో ట్రేడయి 24,350 వరకు వెళ్లినా శుక్రవారం బలమైన రియాక్షన్‌ సాధించింది. మొత్తం మీద...

టెక్‌ వ్యూ : 24000 కీలకం

నిఫ్టీ ఎట్టకేలకు గత వారం కీలక స్థాయి 24000 కన్నా స్వల్పంగా ఎగువన ముగిసింది. ప్రారంభంలో పాజిటివ్‌ ట్రెండ్‌లో ట్రేడయి 24,350 వరకు వెళ్లినా శుక్రవారం బలమైన రియాక్షన్‌ సాధించింది. మొత్తం మీద పాజిటివ్‌గానే ముగిసినా వారం కనిష్ఠ స్థాయిలో ముగియడం పై స్థాయిల్లో అమ్మకాల ఒత్తిడి ఎదురవుతోందనేందుకు సంకేతం. గత మూడు వారాల్లో 2,600 పాయింట్ల మేరకు లాభపడినా జీవిత కాల గరిష్ఠ స్థాయిల కన్నా 2,000 పాయింట్లు దిగువనే ఉంది. ప్రపంచ మార్కెట్ల ధోరణి ఆధారంగా ఈ వారం పాజిటివ్‌గానే ప్రారంభం కావచ్చు. కాని మార్కెట్లో కరెక్షన్‌ రావలసి ఉన్నందు వల్ల గరిష్ఠ స్థాయిల్లో అప్రమత్తంగా ఉండాలి. 24,000 స్థాయిలో మరోసారి పరీక్ష ఎదుర్కొనవచ్చు.

బుల్లిష్‌ స్థాయిలు: తదుపరి నిరోధ స్థాయి 24,200. ఆ పైన 24,300. గతంలో ఇక్కడే మార్కెట్‌ విఫలమై కరెక్షన్‌లో పడింది. పాజిటవ్‌ ట్రెండ్‌ను మరింతగా కొనసాగించేందుకు ఈ స్థాయి కన్నా పైన నిలదొక్కుకోవాలి. 24,000 వద్ద కన్సాలిడేషన్‌ ఉండవచ్చు.


బేరిష్‌ స్థాయిలు: 24,000 వద్ద విఫలమైతే బలహీనత సంకేతం ఇస్తుంది. మద్దతు స్థాయి 23,800. ఇక్కడ కూడా విఫలమైతే మరింత బలహీనపడుతుంది. మరో మద్దతు స్థాయి 23,500.

బ్యాంక్‌ నిఫ్టీ: గత కొద్ది వారాల్లో 7,000 పాయింట్ల మేరకు అద్భుతమైన ర్యాలీ సాధించిన ఈ సూచీలో కరెక్షన్‌ ఏర్పడాల్సి ఉంది. గత వారం 1,000 పాయింట్ల మేరకు దిగజారి 54,660 వద్ద ముగిసింది. మరింత పాజిటివ్‌ ట్రెండ్‌ కోసం తదుపరి నిరోధం 55,100 కన్నా పైన నిలదొక్కుకోవాలి. మైనర్‌ మద్దతు స్థాయి 54,500 కన్నా పైన నిలదొక్కుకోవడంలో విఫలమైతే మరింత బలహీనపడుతుంది.

పాటర్న్‌: మార్కెట్‌ ప్రస్తుతం 200 డిఎంఏల్లో పరీక్ష ఎదుర్కోనుంది. సానుకూలత కోసం ఇక్కడ నిలదొక్కుకోవాలి. 23,800 వద్ద ‘‘అడ్డంగా ఏర్పడిన సపోర్ట్‌ ట్రెండ్‌లైన్‌’’ వద్ద విఫలమైతే మరింత బలహీనపడుతుంది. గత రెండు రోజుల్లో స్వల్పకాలిక ఓవర్‌బాట్‌ స్థితిని సద్దుబాటు చేసుకుంటోంది.


టైమ్‌: ఈ సూచీ ప్రకారం బుధవారం తదుపరి రివర్సల్‌ ఉంది. గత వారంలో టాప్‌ ఏర్పడినందు వల్ల ఈ వారంలో కెరక్షన్‌కు ఆస్కారం ఉంది.

సోమవారం స్థాయిలు

నిరోధం : 24150, 24200

మద్దతు : 23960, 23900

Read Also: Gold Rates Today: నేడు దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం రేట్లు ఇవీ

జీవిత బీమా పాలసీదారులకు రైడర్లతో మరింత రక్షణ

జీఎస్‌టీ రిజిస్ట్రేషన్‌కు ఏం కావాలంటే ?

Updated Date - Apr 28 , 2025 | 02:15 AM